Ram Charan Grand Mother
Ram Charan : మెగా, అల్లు కుటుంబ సభ్యులు ఇప్పుడు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. రామ్ చరణ్(Global Star Ram Charan) అమ్మమ్మ, అనగా అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నాన్నమ్మ, అనగా అల్లు అరవింద్(Allu Aravind) తల్లి కనకరత్నం అనారోగ్యం తో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారని, ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈ నెల 27న జరగబోయే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను మొత్తం రద్దు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రెడీ చేసి, పుట్టినరోజునాడు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మూవీ టీం. ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తుంది. అల్లు అరవింద్ ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నాడు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీస్తున్నాడు.
Also Read : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ గ్లింప్స్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం పై ఎలాంటి క్లారిటీ లేదు. ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అబుదాబి లో ఉంటున్నాడు. అక్కడే ఆయన తన తదుపరి చిత్ర డైరెక్టర్ అట్లీ తో స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తన నాన్నమ్మకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనే విషయం తెలుసుకొని ఆయన వెంటనే ఇండియా కి పయనమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కనకరత్నం గారు ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు కానీ, తన భర్త అల్లు రామలింగయ్య వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అల్లు అరవింద్ కుటుంబం నిర్వహించిన భారీ ఈవెంట్ లో పాల్గొన్నది. అల్లు అరవింద్ ఆమెను స్టేజిని మీదకు తీసుకొచ్చి గౌరవ సత్కారం చేసిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. తన కొడుకు అలా అందరి ముందు సత్కారం చేయడం చూసి ఆమె ఆనందంతో నవ్వినా క్షణాలు ఇప్పటికీ అభిమానులకు గుర్తుకు వస్తూనే ఉన్నాయి. ఆమె నవ్వు ఎప్పుడూ అలా సజీవంగా ఉండాలని, ఆమె తొందరగా కోలుకొని ఆరోగ్యంతో మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టాలని అభిమానులు ఈ సందర్భంగా సోషల్ మీడియా లో ప్రార్థిస్తున్నారు.
Also Read : 1250 సినిమాలు..వందల కోట్ల సంపాదన..రణబీర్ కపూర్ ని దాటేసిన బ్రహ్మానందం!