Tamil Hero Vikram
Chiyaan Vikram : ఒకప్పుడు తమిళ హీరో విక్రమ్(Chiyaan Vikram) కి మన తెలుగులో ఎలాంటి మార్కెట్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన సినీ ప్రస్థానం తెలుగు ఇండస్ట్రీ ద్వారానే మొదలైంది. కానీ ఆయన ఎందుకో ఆ తర్వాత ఎక్కువగా తమిళ సినిమాపైనే తన ఫోకస్ పెట్టాడు. ఫలితంగా అక్కడే భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా మారాడు. అక్కడ ఆయన స్టార్ హీరోగా మారిన తర్వాత, కొన్నాళ్ళకు ‘శివ పుత్రుడు’ అనే సినిమా మన తెలుగులో కూడా విడుదలైంది. ఈ సినిమాలో విక్రమ్ నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప నటుడు సౌత్ ఇండియా కి దొరకడం అదృష్టం అంటూ కొనియాడారు. ఈ చిత్రం తర్వాత ఆయన నుండి విడుదలైన ‘అపరిచితుడు’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరోజుల్లో ఈ సినిమా తమిళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో, తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అయ్యింది.
Also Read : ‘కోర్ట్’ 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ ప్రాంతంలో బాగా తగ్గిందిగా!
ఈ సినిమా తర్వాత విక్రమ్ కి మన టాలీవుడ్ భారీ మార్కెట్ ఏర్పడింది. ఈ చిత్రం తర్వాత ఆయన నుండి విడుదలయ్యే ప్రతీ సినిమాకు మన తెలుగు ఆడియన్స్ బంపర్ రెస్పాన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు విక్రమ్ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. అటు తమిళం లోనూ, ఇటు తెలుగులోనూ విక్రమ్ తీస్తున్న సినిమాలు పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోతున్నాయి. ప్రతీ సినిమాలోనూ ఆయన తన నటనతో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేయాలని ప్రయత్నం చేస్తాడు కానీ, అవి ఈమధ్య సక్సెస్ అవ్వడం లేదు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘తంగలాన్’ కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన ‘వీర ధీర సూర 2′(Veera Dheera Soora 2) తో మన ముందుకు రాబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఆయన నేడు తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో విక్రమ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘తెలుగు సినిమాలను చూస్తే నాకు అసూయ కలుగుతుంది. ఇక్కడ కొత్త రకమైన సినిమాలను ఆదరిస్తారు, అదే విధంగా కమర్షియల్ సినిమాలను కూడా ఆదరిస్తారు. ఇలా రెండు భిన్నమైన జానర్స్ ని ఆదరించే జనాలు ఉన్న ఏకైక ఇండస్ట్రీ ఇది. దేశంలోనే చాలా అరుదు అని చెప్పొచ్చు. నేను మొన్ననే నా మూవీ టీం తో మాట్లాడుతున్నాను. తెలుగు ఆడియన్స్ సినిమాని ఒక పండుగ లాగా జరుపుకుంటారు, ఎంతో ప్రేమిస్తారు, ఆ సంస్కృతి మా తమిళనాడు లో కూడా రావాలని కోరుకుంటున్నాను’ అంటూ విక్రమ్ మాట్లాడిన మాటలని చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.
Also Read : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ గ్లింప్స్ వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!