https://oktelugu.com/

Price Hike: స్కార్పియో కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చిన మహీంద్రా

Price Hike : మహీంద్రా XUV 3XO, స్కార్పియో N, XUV700, థార్ రాక్స్ ధరలు పెరుగుతాయి. మీరు ఈ కార్లలో దేనినైనా కొనాలనుకుంటే.. ఈ నెల అంటే మార్చిలోనే బుక్ చేసుకోండి.. దీని ద్వారా భారీగా పొదుపు చేసుకోవచ్చు.

Written By: , Updated On : March 23, 2025 / 08:12 PM IST
Mahindra Scorpio

Mahindra Scorpio

Follow us on

Price Hike:మారుతి సుజుకి, టాటా, కియా తర్వాత ఇప్పుడు మహీంద్రా కూడా తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకారం, వచ్చే నెల అంటే ఏప్రిల్ 1నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సగటున 3 శాతం వరకు వాహనాల ధరల్లో పెరుగుదల ఉంటుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, మెయింటెన్స్ ఖర్చుల కారణంగా ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని మహీంద్రా తెలిపింది. మహీంద్రా XUV 3XO, స్కార్పియో N, XUV700, థార్ రాక్స్ ధరలు పెరుగుతాయి. మీరు ఈ కార్లలో దేనినైనా కొనాలనుకుంటే.. ఈ నెల అంటే మార్చిలోనే బుక్ చేసుకోండి.. దీని ద్వారా భారీగా పొదుపు చేసుకోవచ్చు.

Also Read : మార్కెట్లోకి రూ.9కోట్ల కారు.. కాకపోతే దీనిని కొంతమందే కొనగలరు

ధరలను ఎందుకు పెంచుతున్నారు?
మారుతి సుజుకి, టాటా, కియా తర్వాత ఇప్పుడు మహీంద్రా కూడా తమ కార్ల ధరలను పెంచే విషయాన్ని ప్రకటించింది. వచ్చే నెల అంటే ఏప్రిల్ నుండి సగటున 3 శాతం వరకు పెరుగుదల ఉంటుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, మెయింటెన్స్, సిలికాన్ చిప్స్ ధరల పెరుగుదల కారణంగా మహీంద్రా తెలిపింది. మహీంద్రా లైనప్ లో స్కార్పియో Nకి జనాల్లో మంచి క్రేజ్ ఉంది.ఇది కంపెనీ బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి.

మహీంద్రా స్కార్పియో N ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.24.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కార్పియో N ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇందులో 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి. అలాగే, ఇందులో 6-వే-పవర్ అడ్జస్ట్ మెంట్ డ్రైవర్ సీటు, సన్ రూఫ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి.

ప్రయాణికుల సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ముందు వెనుక కెమెరాలు, హిల్-అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ కారు టాటా సఫారి, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి కార్లతో పోటీ పడుతుంది.

మహీంద్రా స్కార్పియో-N 2.0L టర్బో పెట్రోల్-ఎంటీ పవర్ట్రెయిన్ మైలేజ్ లీటరుకు 12.70కి.మీ, అయితే 2.0L టర్బో పెట్రోల్-AT మైలేజ్ లీటరుకు 12.12కి.మీ ఇస్తుంది. అదనంగా, 2.2L డీజిల్-MT పవర్ట్రెయిన్ మైలేజ్ లీటరుకు 15.42కి.మీ ఇస్తుంది. డ్యూయెల్ ఇంజిన్ ఆఫ్షన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6-స్పీడ్ AMTతో వస్తుంది.

Also Read : లీటరుకు అదిరిపోయే మైలేజీతో మార్కెట్లోకి కొత్త మారుతి ఆల్టో