Brahmanandam : మన భారత దేశంలో అత్యంత సంపన్నుడైన హాస్య నటుడు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు కపిల్ శర్మ. బాలీవుడ్ లో ఈయన ‘ది కపిల్ శర్మ’ షో ద్వారా సంపాదించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశంలో అత్యధిక శాతం మంది జనాలు ఈ షో ని చూస్తుంటారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా తన సినిమా రిలీజ్ కి ముందు ప్రొమోషన్స్ కోసం కపిల్ శర్మ షో లో పాల్గొనాల్సిందే. అంతకు మించిన ప్రచార మాధ్యమం వాళ్లకు మరొకటి లేదు. ఆ స్థాయికి చేరుకున్న కపిల్ శర్మ నే దేశంలో అత్యధిక సంపాదన కలిగిన కమెడియన్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అతన్ని మించిన సంపన్నుడు ఒకడు ఉన్నాడు. ఆయన మరెవరో కాదు, మన హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం’.
Also Read : చిరంజీవి చేసిన సినిమాల్లో రామ్ చరణ్ కి నచ్చిన రెండు సినిమాలు ఇవేనా..?
ఒక లెక్చరర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈయన, సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీ లోకి రావడం, ఇతన్ని మెగాస్టార్ చిరంజీవి, జంధ్యాల ప్రోత్సహించడం కారణంగా సినిమాల్లో అవకాశాలను సంపాదించి, తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో, 1250 కి పైగా సినిమాలు చేసి, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు, ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ బ్రహ్మానందం వెండితెర పై కనిపిస్తే ప్రేక్షకులు ఒక స్టార్ హీరోకి చేసేంత గోల చేస్తారు. అది ఆయనకు ఉన్నటువంటి క్రేజ్. ఒకప్పుడు ఏడాది 40,50 సినిమాలు కూడా చేసిన చరిత్ర ఆయనది. బ్రహ్మానందం ఒక సినిమా లో ఉన్నాడంటే చాలు, ప్రేక్షకులు కళ్ళు మూసుకొని టికెట్స్ బుక్ చేసుకునేవాళ్ళు. అలాంటి చరిత్ర ఉన్న బ్రహ్మానందం, ఈమధ్య కాలం లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాల సంఖ్య బాగా తగ్గించేశాడు. ఇదంతా పక్కన పెడితే బ్రహ్మానందం తన కెరీర్ మొత్తం మీద సంపాదించిన ఆస్తులు 500 కోట్ల రూపాయలకు పైగానే ఉందట.
ఇంత సంపాదన ఉన్న కమెడియన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు. కేవలం కమెడియన్స్ జాబితా లోనే కాదు, పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ గా పిలవబడే రణబీర్ కపూర్, ప్రభాస్, చివరికి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా బ్రహ్మానందం కంటే తక్కువ సంపాదనే సంపాదించారు. రణబీర్ కపూర్ తన కెరీర్ మొత్తం మీద 350 కోట్ల రూపాయిలు సంపాదిస్తే, ప్రభాస్ 300 కోట్లు, అదే విధంగా రజినీకాంత్ 400 కోట్ల రూపాయిలు సంపాదించారట. ఇక మరో పాపులర్ ఇండియన్ కమెడియన్ గా పిలవబడే కపిల్ శర్మ ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయిల వరకు సంపాదించాడట. ఇక చాలు లే, ఆరోగ్యం చూసుకుందాం అని ఆయన సినిమాల సంఖ్య కాస్త తగ్గించబట్టి సరిపోయింది. లేకపోతే బ్రహ్మానందం రేంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవడానికి కూడా కష్టమే, అది బ్రహ్మానందం రేంజ్.
Also Read : సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!