Ram Charan , Prashanth Neel
Ram Charan and Prashanth Neel : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య కాంపిటీషన్ అయితే ఉంటుంది. వాళ్ల సినిమాలతో భారీ విజయాన్ని సాధిస్తే మరొకరు వచ్చి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇలా ఎప్పటికప్పుడు స్టార్ హీరోల విషయంలో క్యాలిక్యులేషన్స్ అనేవి మారిపోతూనే ఉంటాయి. తద్వారా వాళ్ల మార్కెట్ కూడా పెంచుకుంటూ వెళ్తుంటారు… మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న ఆయన ఇప్పటికి సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక తన నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా రామ్ చరణ్ సైతం తన దైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ఇప్పుడు బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. అయితే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో క్రికెటర్ ధోని నటిస్తున్నాడా..?
అయితే ఈ సినిమా 1980 నాటి కథతో తెరకెక్కబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ స్టైల్ లోనే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుందట. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా 2028వ సంవత్సరంలో పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయి.
ఆలోపు ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత ప్రభాస్ తో చేయాల్సిన సినిమాను కూడా కంప్లీట్ చేసి రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతారట. మరి ఈ లోపు రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు, సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలను కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నవే కావడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.
Also Read : నాకు నెట్ ఫ్లిక్స్ మాత్రమే కావాలంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..అభిమానులకు చేదువార్త!