Ram Charan
Ram Charan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలతో భారీ విజయాలను సాధించాడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఎదగడమే కాకుండా పాన్ ఇండియాలో గ్లోబల్ స్టార్ గా అవతరించి ప్రేక్షకులందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు… ఇప్పటి వరకు ఆయన సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ముందుకు సాగుతున్నాయి. ఇకమీదట అంతకు మించిన సక్సెస్ లతో ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు…
మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఆయన చేస్తున్న ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్న మైతే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు రామ్ చరణ్ ఇప్పటి వరకు ఇలాంటి నేపధ్యంలో సినిమాలైతే చేయలేదు. కాబట్టి తనకు ఇది చాలా ప్రత్యేకంగా నిలవబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి ఒక సన్నివేశంలో క్రికెట్ కోచింగ్ ఇవ్వడానికి మహేంద్ర సింగ్ ధోని కూడా కనిపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలైతే వైరల్ అవుతున్నాయి.
Also Read : నాకు నెట్ ఫ్లిక్స్ మాత్రమే కావాలంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..అభిమానులకు చేదువార్త!
మరి ఏది ఏమైనా కూడా ధోని కనక ఈ సినిమాలో నటించినట్టయితే సినిమా మీద భారీ అంచనాలు పెరగడమే కాకుండా ఇండియా వైడ్ గా ఈ సినిమాకి భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ధోనీ సైతం సినిమా కథను విన్న తర్వాత ఆయన కూడా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్న ఇచ్చాడు.
ఇక ఈ సినిమాతో పాటుగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు… రామ్ చరణ్ ఇక మీదట వచ్చే వరుస సినిమాలతో భారీ విజయాలను సాధించమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా కోసం భారీ సెట్ వేశారా..?