Allu Arjun
Allu Arjun : పుష్ప 2 (Pushpa 2) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాను షేక్ చేసిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం తను చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ (Atlee) చెప్పిన కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చడంతో ఆయనతో సినిమాని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి వీరిద్దరికి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని అట్లీ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాలను సాధించి ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ ఇంతకుముందు చేసిన సినిమాలన్ని వరుస విజయాలను సాధించాయి. ఇక ఇంతకుముందు షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తో చేసిన జవాన్(Jawan) సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అట్లీకి దర్శకుడిగా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. కాబట్టి అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా అంతకుమించి ఉండేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడట.
Also Read : అల్లు అర్జున్, నాని కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..?
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ లైనప్ అనేది ఇప్పుడు మరింత పెరిగిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే ఆయన అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న నెల్సన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
నెల్సన్ (Nelsan) ఇప్పటికే రజనీకాంత్ (Rajinikanth)కి జైలర్(Jailer) సినిమాతో మంచి విజయాన్ని అందించాడు. ఇక ప్రస్తుతం జైలర్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి నెల్సన్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని విషయం అందరికీ చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా జైలర్ 2 సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించిన, సాధించకపోయిన కూడా అల్లు అర్జున్ మాత్రం నెల్సన్ తో ఒక సినిమా చేయాలని కమిట్ అయినట్టుగా తెలుస్తోంది…
Also Read : కెరీర్ లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్న అల్లు అర్జున్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!