Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi Movie Teaser: మొన్న క్రికెట్ 'బ్యాట్' తో..రేపు 'గద' తో.. వీరంగం...

Ram Charan Peddi Movie Teaser: మొన్న క్రికెట్ ‘బ్యాట్’ తో..రేపు ‘గద’ తో.. వీరంగం సృష్టించబోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ ..

Ram Charan Peddi Movie Teaser: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) మూవీ వచ్చే నెల 28 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా టైట్ షెడ్యూల్స్ మధ్య నడుస్తోంది. రీసెంట్ గానే షూటింగ్ జరుగుతున్న సమయం లో రామ్ చరణ్ కంటికి కి చిన్న గాయం అవ్వడం తో, ఒక రోజు పాటు షూటింగ్ ని నిలిపివేశారు. ఇంతటి టైట్ షెడ్యూల్స్ మధ్య షూటింగ్ నడుస్తుంది, ఇలాంటి సమయం లో బ్రేక్ రావడం వల్ల , సినిమా అనుకున్న సమయానికి విడుదల అవ్వడం కష్టమేమో అని అంతా అనుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే రేపు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో , ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ ని ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు మేకర్స్.

ఇన్ని రోజులు ‘పెద్ది’ చిత్రం అంటే మన అందరికీ గుర్తుకొచ్చేది క్రికెట్. ఒక గ్లింప్స్ వీడియో, రెండు సాంగ్స్ ని ఇప్పటి వరకు మేకర్స్ విడుదల చేస్తే, అందులో కూడా రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని కనిపిస్తాడు. అయితే రేపు విడుదల చెయ్యబోయే టీజర్ లో రామ్ చరణ్ గదతో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో ని ఒకటి ఆ చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా , అది బాగా వైరల్ అయ్యింది. రేపు విడుదల చేసే టీజర్ లో రామ్ చరణ్ కుస్తీ ఫైటింగ్ చేయబోతున్నాడు. అభిమానులు ఈ టీజర్ పై ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి, ఆ అంచనాలకు మించే ఉంటుందని, ఇప్పటికే ఈ చిత్రం పై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉందని, ఈ టీజర్ తో ఆ క్రేజ్ పదింతలు ఎక్కువ అవుతుందని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఓవర్సీస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని రేపటి నుండి మొదలు పెట్టాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ నిర్మాతలు నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ని ఏప్రిల్ 8 నుండి మొదలు పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం తో , ఏప్రిల్ 8 నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుంది. ఇక్కడే అభిమానులకు ఈ సినిమా మళ్లీ వాయిదా పాడబోతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఒక రోజు షూటింగ్ ఆగిపోవడం తో, దాని ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా వాయిదా పడుతుందా ? , లేదా చెప్పిన తేదీకే విడుదల అవుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Qualities Women Like In Men

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ...
Rajinikanth Biopic

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...
Nagarjuna

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...
Ram Charan long break after Peddi

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Oktelugu Epaper