Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి…అవి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికి ప్రేక్షకుల్లో ఈ మూవీ మీద భారీ అంచనాలైతే రావడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే బుచ్చిబాబు ఈ సినిమా మీద హైప్ ను క్రియేట్ చేయాల్సిన అవసమైతే ఉంది. ఇక దానికోసం ఆయన ఏం చేస్తాడు ఎలా చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక రిలీజ్ కి మరో 40 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బుచ్చిబాబు ఈ సినిమా మీద ఎలాంటి కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడా? లేదా అనేది కూడా మెగా అభిమానులను కలవరపరుస్తుంది.
Also Read: పవర్ హౌస్‌గా కరీంనగర్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..
ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అవుతుందా? లేదంటే మళ్లీ పోస్ట్ పోన్ చేసే ఉద్దేశ్యం ఏదైనా ఉందా? అని వాళ్ళు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం ఏప్రిల్ మొదటి వారం నుంచి చేపడతారట.
అందులో భాగంగానే టీజర్, ట్రైలర్ లను సైతం చాలా పకడ్బందీ ప్రణాళికతో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో విశేషమైన హైప్ ను క్రియేట్ చేయడానికి బుచ్చిబాబు ఆయన టీం ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటివరకు బుచ్చిబాబు స్టార్ హీరోలతో సినిమా చేయలేదు. ఆయన చేసిన ఉప్పెన సినిమా సక్సెస్ అయింది. అయినప్పటికి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను తను ఎలా హ్యాండిల్ చేశాడు అనే దానిమీద ప్రతి ఒక్కరు కొన్ని అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఆయన మాత్రం చాలా ప్రణాళికతో సినిమాను చేశారట. సుకుమార్ సైతం తన వెనకాలే ఉన్నాడు కాబట్టి తనకు ఏది కావాలంటే అది ఇచ్చి ప్రోత్సహించడంతో బుచ్చిబాబు చెలరేగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా రిసల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
