spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh First Day Collections: 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదటి రోజు వరల్డ్...

Ustaad Bhagat Singh First Day Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. పవన్ కళ్యాణ్ మూవీ కి ఇంత తక్కువ ఓపెనింగా?

Ustaad Bhagat Singh First Day Collections: టాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి ఓపెనింగ్ వసూళ్లు రాబట్టే హీరో ఎవరు అని అడిగితె మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). ఆయన సినిమా చేస్తే , కాసుల వర్షం కురిపిస్తాం అనే రేంజ్ లో ఉంటారు జనాలు. ‘హరి హర వీరమల్లు’ లాంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయిల రేంజ్ లో ఓపెనింగ్ వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి అనేది. అలాంటి పవర్ స్టార్ కి తక్కువ ఓపెనింగ్స్ వస్తాయని కలలో కూడా ఊహించి ఉండము . కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) చిత్రానికి అదే జరిగింది. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ని చూస్తే అభిమానులకు కన్నీళ్లు రాక తప్పదు.

Also Read: పవర్‌ హౌస్‌గా కరీంనగర్‌.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 52 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు ముందు విడుదలైన ‘ఓజీ’ చిత్రానికి దాదాపుగా మొదటిరోజున 153 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఆ ఓపెనింగ్ లో పావు శాతం కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి లేకపోవడం గమనార్హం. ఈ సినిమాకు ఇంత తక్కువ గ్రాస్ వసూళ్లు రావడానికి గల కారణం నైజాం ప్రాంతం లో టికెట్ రేట్స్ లేకపోవడం , ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ షోస్ కూడా లేకపోవడమే. హరి హర వీరమల్లు కి వచ్చిన ఓపెనింగ్ లో ప్రీమియర్ షోస్ చాలా పెద్ద పాత్ర పోషించింది. ‘ఓజీ’ కి కూడా ప్రీమియర్ షోస్ లేకపోతే ఆ రేంజ్ ఓపెనింగ్ ఉండేది కాదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ కి ప్రీమియర్స్ కి బదులు బెనిఫిట్ షోస్ వేయడం దురదృష్టకరం.

ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ట్రెండ్ ఇది. ఇప్పుడు ఆడియన్స్ ప్రీమియర్ షోస్ కి బాగా అలవాటు పడ్డారు. ఆ ప్రభావం చాలా గట్టిగానే ఈ చిత్రం మీద పడింది. ఇక మొదటి రోజు ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో సెన్సేషనల్ ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. కానీ టికెట్ హైక్స్ లేకపోవడం వల్ల కేవలం 11 కోట్ల షేర్ ఓపెనింగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే విధంగా గుంటూరు జిల్లాలో 2 కోట్ల 43 లక్షలు, సీడెడ్ ప్రాంతం లో 4 కోట్ల 21 లక్షలు, నెల్లూరు జిల్లాలో లో కోటి 20 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 కోట్ల 10 లక్షలు, ఉత్తరాంధ్ర లో 4 కోట్ల 20 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల 50 లక్షలు, కృష్ణ జిల్లాలో 2 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకు 33 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 2 కోట్లు, ఓవర్సీస్ నుండి నాలుగు కోట్లు, ఓవరాల్ గా ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper