Ram Charan and NTR : ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram charan) హీరోలుగా రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం లో తెరకెక్కిన #RRR మూవీ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా మేనియా నుండి ఇంకా పూర్తిగా జనాలు కోలుకోలేదు. రీసెంట్ గానే లండన్ లో ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్రానికి సంబంధించిన లైవ్ షోని నిర్వహించారు. ఈ షోకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి హాజరు అయ్యారు. లైవ్ షో మొదలయ్యే ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి తదితరులు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో అనేక ప్రశ్నలు అడగ్గా, ఆసక్తికరమైన సమాదానాలు మూవీ టీం నుండి వచ్చాయి. #RRR మూవీ కి సీక్వెల్ ఉంటుందా లేదా అని రిపోర్టర్ రాజమౌళి ని అడగగా, కచ్చితంగా ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. కానీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!
ఇదంతా పక్కన పెడితే లండన్ మరో #RRR త్రయం కలవడం తో ముగ్గురు మంచి జోష్ తో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ , దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి రాజమౌళి ని గట్టిగా పట్టుకోవడం, రాజమౌళి ఆ తర్వాత అదుపు తప్పి సోఫా లో పడిపోవడం, వెనుక నుండి ఉపాసన #RRR పార్ట్ 2 ఉంటుందా లేదా అని అడిగితే రాజమౌళి ఉంటుంది అని సమాధానం ఇవ్వడం, ఇవ్వన్నీ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే #RRR మూవీ కి సీక్వెల్ కి కావాల్సిన కంటెంట్ ని క్రియేట్ చేసేందుకు మంచి స్కోప్ ఉంది. కానీ ఈ ఇద్దరు హీరోలు ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉంది. రామ్ చరణ్ నాలుగేళ్ల పాటు ఫుల్ బిజీ, ఎన్టీఆర్ పరిస్థితి కూడా అంతే.
Also Read : రామ్ చరణ్ హిట్ కొడితే ఎన్టీఆర్ బాధపడక తప్పదు.. లాజిక్ ఇదే!
నాలుగేళ్ల తర్వాత #RRR మూవీ ని ఆడియన్స్ ఎంత మంది గుర్తించుకుంటారో చెప్పలేం, ఎందుకంటే ఆ సినిమాకి బాహుబలి లాంటి క్లాసిక్ స్టేటస్ లేదు, కేవలం ఇద్దరు హీరోలు ఉన్నారు అనే క్రేజ్ తోనే ఈ చిత్రం అంత పెద్ద హిట్ అయ్యింది అనడంలో అతిశయోక్తి లేదేమో. సెకండ్ హాఫ్ మీద అప్పట్లో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అయినప్పటికీ హీరోల మ్యాజిక్ కారణంగా ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే కష్టమే. రాజమౌళి ఎప్పుడు అడిగినా సీక్వెల్ ఉంటుంది అనే అంటాడు, కానీ అది జరగని పని అని రాజమౌళి కి తెలుసు, ఫ్యాన్స్ కి కూడా తెలుసు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో రాజమౌళి స్పెషల్ గా సినిమా చేసే అవకాశం ఉంటుంది అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
https://www.youtube.com/shorts/36S_q3e4XJw