https://oktelugu.com/

చరణ్ తో ‘జెర్సీ’ డైరెక్టర్ భారీ యాక్షన్ !

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నానితో ‘జెర్సీ’ చిత్రం చేసి.. అదే సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం గౌతమ్ తిన్ననూరి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలని గౌతమ్ డిసైడ్ అయ్యాడట. అన్నట్టు ఈ సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : December 31, 2020 / 05:44 PM IST
    Follow us on


    దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నానితో ‘జెర్సీ’ చిత్రం చేసి.. అదే సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం గౌతమ్ తిన్ననూరి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలని గౌతమ్ డిసైడ్ అయ్యాడట. అన్నట్టు ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో గౌతమ్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట.

    Also Read: మహేష్ బాబు పాత్రతో 2020కి డేవిడ్ వార్నర్ వీడ్కోలు

    ఇక గౌతమ్, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా గౌతమ్ లాస్ట్ మూవీ ‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించడంలో జెర్సీ కాస్త వెనుక బడినా.. చరణ్ తో చేయబోయే సినిమా పై భారీ ఎక్స్ పెటేషన్స్ ఉంటాయి. మరి, చరణ్, గౌతమ్ కథను ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఒప్పుకున్నా చరణ్ తో సినిమా అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతం చరణ్ బిజీగా ఉన్నాడు.

    Also Read: సింగిల్ డేకి 15 లక్షలు తీసుకుందట !

    ఇక తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. ముఖ్యంగా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు అలాగే తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోన్నట్లు గౌతమ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశాడట. ఇక షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొని ఉంది. మరి గౌతమ్ తిన్ననూరి హిందీలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్