సూపర్‌ స్టార్‌ నిర్ణయం పై మోహన్ బాబు రియాక్షన్ !

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి మంచి స్నేహ బంధం ఉంది. ఆ మాటకొస్తే స్టార్ హీరోలతో మంచి బంధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు మోహన్ బాబు. ఇక ఇటీవల హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌లో అస్వస్థతకు లోనై, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన రజిని, ట్రీట్‌మెంట్‌ అనంతరం చెన్నై వెళ్లిపోయారు. ఆ తరువాత వెంటనే రజినీకాంత్‌ ఓ సంచలన ప్రకటనను రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. గత నెలలో ఓ మీటింగ్ పెట్టి మరీ […]

Written By: admin, Updated On : December 31, 2020 5:53 pm
Follow us on


సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి మంచి స్నేహ బంధం ఉంది. ఆ మాటకొస్తే స్టార్ హీరోలతో మంచి బంధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు మోహన్ బాబు. ఇక ఇటీవల హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్‌లో అస్వస్థతకు లోనై, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన రజిని, ట్రీట్‌మెంట్‌ అనంతరం చెన్నై వెళ్లిపోయారు. ఆ తరువాత వెంటనే రజినీకాంత్‌ ఓ సంచలన ప్రకటనను రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. గత నెలలో ఓ మీటింగ్ పెట్టి మరీ జనవరిలో రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని అట్టహాసంగా ప్రకటించిన రజినీ.. చివరకు ‘నో పాలిటిక్స్‌’ అంటూ తేల్చేశారు.

Also Read: మహేష్ బాబు పాత్రతో 2020కి డేవిడ్ వార్నర్ వీడ్కోలు

అయితే సూపర్ స్టార్ తీసుకున్న ఈ నిర్ణయం పై అభిమానులు బాగా నిరాశకు లోనైనా… రజిని మిత్రులు మాత్రం మంచి నిర్ణయం అంటూ అభినందిస్తున్నారు. రజిని ఆరోగ్య రీత్యా.. సూపర్‌స్టార్‌ తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం సరైన నిర్ణయం అని తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు కూడా, రజినీకాంత్‌ నిర్ణయం పై స్పందిస్తూ.. ఓ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: సింగిల్ డేకి 15 లక్షలు తీసుకుందట !

మోహన్ బాబు మాటల్లో ‘రజినీకాంత్‌ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్యరీత్యా పాలిటిక్స్‌లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ, ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను. నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచివాడివి, చీమకు కూడా హాని చేయనివాడివి, నా దృష్టిలో ఒన్‌ ఆఫ్‌ ది గ్రేటెస్ట్ పర్సన్‌.. నీలాంటి వ్యక్తికీ, నాలాంటి వ్యక్తికీ రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే.. మనం ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడతాం, ఎవరికి ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్టు కొనలేము, కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచివాడివి అన్న నోళ్లే, రేపు వచ్చాక చెడ్డవాడివి అంటాయి. రాజకీయం ఒక రొచ్చు.. ఒక బురద.. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయింది. రజినీకాంత్‌ అభిమానులందరూ రజినీకాంత్‌ అంత మంచివాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను..” అని మోహన్‌బాబు తన లెటర్ లో పోస్ట్ చేసారు. పనిలో పనిగా మోహన్ బాబు, తనను తానూ రజినీకాంత్ తో పోల్చుకుని తన నైజాన్ని మరోసారి సగర్వంగా చాటుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్