‘క్రెడిట్’ వద్దు.. కాలేజీ చాలంటున్న జగ్గారెడ్డి..!

టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న నేతలంతా రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ పోరాటాలకు సిద్ధమవుతుండటం విశేషం. Also Read: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం భేటి.. కీలక అంశాలివే..! పీసీసీ రేసులో తాను సైతం ఉన్నానని చెప్పుకుంటున్న జగ్గారెడ్డి కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా మీడియా సమావేశం నిర్వహించి జగ్గారెడ్డి […]

Written By: Neelambaram, Updated On : December 31, 2020 7:51 pm
Follow us on

టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న నేతలంతా రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ పోరాటాలకు సిద్ధమవుతుండటం విశేషం.

Also Read: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం భేటి.. కీలక అంశాలివే..!

పీసీసీ రేసులో తాను సైతం ఉన్నానని చెప్పుకుంటున్న జగ్గారెడ్డి కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈక్రమంలోనే తాజాగా మీడియా సమావేశం నిర్వహించి జగ్గారెడ్డి సీఎం వ్యవహర శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సంగారెడ్డి నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు గడిస్తుందని గుర్తు చేశాడు. ఇప్పటివరకు ఆ హామీని ప్రభుత్వం ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని జగ్గారెడ్డి ప్రశ్నలవర్షం కురిపించాడు.

సంగారెడ్డిలో ఏర్పాటు కావాల్సిన మెడికల్ కళాశాలను సిద్ధిపేటకు తీసుకెళ్లాలని జగ్గారెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో, అసెంబ్లీ సమావేశంలోనూ సీఎం కేసీఆర్ సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపాడు.

Also Read: ఓటుకు నోటు కేసులో బుక్కైన చంద్రబాబు.? ఒప్పుకున్న మత్తయ్య?

సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్రం వద్ద మెడికల్ కళాశాల గురించి అడిగి ఉంటే బాగుండేదని తెలిపారు. మెడికల్ కళాశాల హామీని కేసీఆర్ మర్చిపోయినట్లు ఉన్నారని.. అందుకే మరోసారి తాను గుర్తు చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపాడు.

సంగారెడ్డి మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే చాలని.. ఆ క్రెడిట్ మీరే తీసుకోండంటూ జగ్గారెడ్డి సూచించాడు. మెడికల్ కళాశాల కోసం తాను జనవరి వరకు వెయిట్ చేస్తానని.. అప్పటికీ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే పోరాటానికి దిగుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశాడు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్