https://oktelugu.com/

Ram Charan – Chiranjeevi : తన కూతుర్ని చిరంజీవి కి దూరంగా పెట్టిన రామ్ చరణ్..! కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మొబైల్ ఫోన్స్ లోపలకు తీసుకొని రాకూడదు అని, ఫోటోలు తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యడం వల్ల పాపకి దిష్టి తగులుతుందని అంటున్నారట.

Written By:
  • Vicky
  • , Updated On : July 9, 2023 / 08:32 AM IST
    Follow us on

    Ram Charan – Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు రీసెంట్ గానే ఒక పాప పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాప కి క్లిన్ కారా అనే పేరుని ఖరారు చేసారు. పాప పుట్టిన ఆనందం లో మెగా కుటుంబం మరియు మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పెళ్ళైన 11 ఏళ్లకు పుట్టిన సంతానం కావడం తో మెగా ఫ్యామిలీ మొత్తానికి ఈ పాప ఎంతో అపురూపం అనే చెప్పాలి. అయితే రామ్ చరణ్ -ఉపాసన ఈ పాప విషయం లో అతి జాగ్రత్త తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక మాట వినిపిస్తుంది.

    వాళ్లిద్దరూ తీసుకునే ఆ జాగ్రత్తలు కొంతమంది ఇండస్ట్రీ లో ఉన్నవారి మనస్సు నోచుకునే విధంగా చేస్తుందని అంటున్నారు. ఎవరైనా పాప ని చూసేందుకు ఇంటికి వచ్చేవారిపై కఠినమైన ఆంక్షలు విదిస్తున్నారట. మొబైల్ ఫోన్స్ లోపలకు తీసుకొని రాకూడదు అని, ఫోటోలు తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యడం వల్ల పాపకి దిష్టి తగులుతుందని అంటున్నారట.

    అంతే కాదు పాపని ముట్టుకోడానికి కూడా వీలు లేదట, కుటుంబ సబ్యులకు కూడా ఈ నియమం పెట్టారట. చిన్న పాప కాబట్టి ఇన్ఫెక్షన్స్ చాలా సులువుగా సోకుతుందని, అందుకే ఈ నియమం పెట్టమని అంటున్నారు. కనీసం చిరంజీవి మరియు సురేఖ గార్లను కూడా ముట్టుకోనివ్వడం లేదట. ఒక నెల రోజుల పాటు ఇలా ఉండక తప్పదని అంటున్నారు. ఖాలీ సమయం దొరికినప్పుడు పాప తో ఆదుకోవాల్సిన చిరంజీవి ఇప్పుడు తన భార్య తో కలిసి విదేశాలకు టూర్ కి వెళ్ళాడు.

    అందుకు కారణం ఇదేనట, ఈ విషయం సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని, ఒకవేళ నిజం అయితే మాత్రం ఇంత అవసరం లేదని అంటున్నారు ఫ్యాన్స్. పాప కి ప్రత్యేకంగా ఒక రూమ్ ని కేటాయించి , అందులోనే ఆమెకి కావాల్సిన అవసరాలన్నీ చూస్తున్నారట.