Allu Arjun : ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాయలసీమకు చెందిన ఓ టీడీపీ నేత ఆతిధ్యాన్ని అల్లు అర్జున్ స్వీకరించారు. ఆయన ఫార్మ్ హౌస్ లో సందడి చేశారు. రాయలసీమ వంటకాలను ఆరగించాడు. ఇది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ స్నేహితులతో హైదరాబాద్ నుండి బెంగుళూరు కారులో వెళుతున్నారు. ఆయన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో గల కనుంపల్లి వద్ద ఆగారు. స్థానిక టీడీపీ నేత మంటిమడుగు కేశవరెడ్డి అల్లు అర్జున్ ని ఇంటికి ఆహ్వానించారు.
అల్లు అర్జున్ కి రాయలసీమ వంటకాలతో ప్రత్యేక భోజనం పెట్టారు. కేశవ రెడ్డి కొడుకు రాహుల్ రెడ్డి పక్కనే ఉన్నాడు. కేశవరెడ్డి కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ కాసేపు ముచ్చటించారు. అలాగే కేశవ రెడ్డి ఫార్మ్ హౌస్ ని సందర్శించారు. అనంతంర ఫోటోలకు ఫోజిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేకున్నప్పటికీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు పుష్ప 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో పుష్ప 2 విడుదలయ్యే అవకాశం కలదు. దేశవ్యాప్తంగా పుష్ప 2 పై భారీ హైప్ నెలకొంది. వెయ్యి కోట్ల వసూళ్ల టార్గెట్ తో బరిలో దిగుతున్నట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు.
ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించారు. 2024 ప్రథమార్థంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. వీరి కాంబోలో ఇది నాలుగవ చిత్రం. అల్లు అర్జున్-త్రివిక్రమ్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గత చిత్రం అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి.