https://oktelugu.com/

Ram Charan: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో రామ్ చరణ్ ?

Ram Charan:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డిజిటల్ వేదికపై ఉర్రూతలూగించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఓ హాలీవుడ్ వెబ్‌సిరీస్‌ను రీమేక్ చేస్తోందట. అందులో తొలుత బాలీవుడ్ స్టార్‌ను తీసుకోవాలని భావించినప్పటికీ.. సౌత్‌ ఇండియా నుంచి అటెన్షన్ రాబట్టేందుకు రామ్ చరణ్‌ని ఎంపిక చేశారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇక ప్రస్తుతం ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 15, 2022 / 02:55 PM IST
    Follow us on

    Ram Charan:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డిజిటల్ వేదికపై ఉర్రూతలూగించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఓ హాలీవుడ్ వెబ్‌సిరీస్‌ను రీమేక్ చేస్తోందట. అందులో తొలుత బాలీవుడ్ స్టార్‌ను తీసుకోవాలని భావించినప్పటికీ.. సౌత్‌ ఇండియా నుంచి అటెన్షన్ రాబట్టేందుకు రామ్ చరణ్‌ని ఎంపిక చేశారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

    Ram Charan

    ఇక ప్రస్తుతం ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. కాగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జరగనుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌ లో రామ్‌ చరణ్‌ పై ఫైటింగ్ సీన్స్‌ ను చిత్రీకరించనున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు.

    Also Read:  ఈ రాశి వారికి నమ్మించి వెన్నుపోటు పొడిచే లక్షణాలు ఎక్కువ… అందులో మీ రాశి కూడా ఉందేమో చూడండి!

    చరణ్ కి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి కాగానే.. ఆ వెంటనే అమృత్‌ సర్‌ లోనూ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది.

    Ram Charan

    అన్నట్టు ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. అన్నట్టు శంకర్ ఈ సినిమాతో తన దర్శకత్వ పరిధిని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.

    Also Read:  ఫిబ్రవరి 25న ‘గని’గా రానున్న వరుణ్ తేజ్ !

    Tags