Ram Charan
Ram Charan: దేశం మెచ్చుకునే దర్శకుల్లో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. రాజమౌళి మాదిరి ఆయనకు కూడా అపజయం అంటే తెలియదు. ఆయన తెరకెక్కించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే బాక్సాఫీస్ షేక్ చేశాయి. బాక్సాఫీస్ సక్సెస్ పక్కన పెడితే అద్భుతమైన చిత్రాలు ఇచ్చిన దర్శకుడు ఆయన. సోషల్ సబ్జక్ట్స్ ని చాలా ఎంటర్టైనింగ్ చెబుతారు. అలాంటి దర్శకుడితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టమే. కాగా హీరో రామ్ చరణ్ తో ఆయన సినిమా దాదాపు ఖాయమే అంటున్నారు.
తాజాగా ముంబై వెళ్లిన రామ్ చరణ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీని కలిశారనేది బాలీవుడ్ వర్గాల సమాచారం. రాజ్ చరణ్ కి రాజ్ కుమార్ ఓ స్క్రిప్ట్ నేరేట్ చేశాడట. సానుకూలంగా రామ్ చరణ్ స్పందించిన నేపథ్యంలో ఈ కాంబో కార్యరూపం దాల్చడం ఖాయం అంటున్నారు. మరి అదే నిజమైతే ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.
ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ డంకీ చిత్రం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. అదే రోజు సలార్ విడుదలవుతుండగా ప్రభాస్-షారుఖ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారు. మారి డంకీ అనంతరం రాజ్ కుమార్ హిరానీ చేసే మూవీ రామ్ చరణ్ దే కావచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి కాగా వచ్చే ఏడాది చివరో లేదా 2025 ప్రారంభంలో విడుదల కావచ్చు. అనంతరం ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 చేస్తారు. ఈ రెండు చిత్రాల తర్వాత హిరానీ మూవీ ఉండొచ్చు. రాజ్ కుమార్ హిరానీ స్క్రిప్ట్ డెవలప్మెంట్ కి చాలా సమయం తీసుకుంటారు. కాబట్టి రామ్ చరణ్ తో మూవీ ఓకే అయితే… డంకీ అనంతరం రామ్ చరణ్ ప్రాజెక్ట్ పై ఆయన కూర్చోవచ్చు.