Ram Charan Upasana: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ కు చరణ్ స్మాల్ బ్రేక్ ఇచ్చాడు. ఇటీవల రాజమండ్రిలో షూటింగ్ ను పూర్తి చేసుకుని, హైదరాబాద్ వచ్చిన చరబ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వేకేషన్ కి వెళ్తున్నాడు. ‘రెండేళ్ల తర్వాత రామ్ చరణ్‌తో వెకేషన్‌కి వెళుతున్నాను’ అంటూ ఉపాసన తాజాగా ట్విట్టర్ లో ఒక మెసేజ్ చేసింది.

కాగా రామ్‌చరణ్–శంకర్ సినిమాని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడు.
Also Read: భీమ్లా నాయక్ లో రానా పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..
ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ మార్చి 18 నుంచి 28వ తేదీ వరకు రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. ఐఏఎస్ అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది.

నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింతగా రెట్టింపు అయింది. కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు.
Also Read: ‘సురేఖావాణి’ని వాడుకుని మోసం.. అలెర్ట్ అయిన సురేఖావాణి !