Bigg Boss OTT Telugu Elimination: బిగ్‌బాస్ అభిమానులను భారీ అంచనాలతో అలరించడానికి గ్రాండ్ గా లాంచ్ అయిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఫస్ట్ వీకెండ్ గడిచింది. ఇక మొదటి వారంలో ఇంటి నుంచి బయటకు ఎవరు వస్తారా ? అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ముమైత్ ఖాన్ ఫస్ట్ వీక్ లోనే బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ లో సరయు, ముమైత్ ఖాన్‌లు చివరి వరకు మిగిలారు. ఓ దశలో తానే కచ్చితంగా ఎలిమినేట్ అవుతాను అంటూ సరయు వెక్కి వెక్కి ఏడ్చేసింది కూడా.

‘7 ఆర్ట్స్ సరయు.. 7 డేస్ సరయు’ అంటూ మళ్లీ తనను బ్యాడ్ గా ట్రోల్స్ చేస్తారంటూ సరయు తట్టుకోలేకపోయింది. కట్ చేస్తే.. సరయు, ముమైత్ ఖాన్ లలో ముమైత్ ఎలిమినేట్ అయ్యింది. ఇక తాను సేఫ్ అయ్యాను అని తెలిసినా కూడా సరయు తన ఎమోషన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. పెద్దగా గుక్కపట్టి ఏడ్చేసింది. అయితే, విచిత్రంగా తానూ ఎలిమినేట్ అయ్యానని తెలిశాక కూడా ముమైత్ ఖాన్ మాత్రం అలాగే నవ్వుతూ కనిపించింది.
పైగా ఎవ్వరూ తన వద్దకు రావొద్దని, తనను కొంత సేపు వదిలేయండని ముమైత్ ఖాన్ మధ్యలో సీరియస్ కూడా అయ్యింది. వెంటనే ముమైత్ ఖాన్ స్మోకింగ్ జోన్‌లోకి వెళ్లి స్కోక్ చేస్తూ కొన్ని ఆరోపణలు కూడా చేసింది. నన్ను కావాలనే బ్యాడ్ చేస్తున్నారు అని, బయటకు కూడా తనను అలానే చూపిస్తున్నారు అంటూ ముమైత్ ఫీల్ అయ్యింది.
పనిలో పనిగా అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ అరియానా, తేజస్వీ, అషూ ఇలా కనిపించిన వారందరికీ ముమైత్ ఖాన్ ఒక సలహా పడేసింది. మరి ఆ జాగ్రత్త ఎదో తానే తీసుకుని ఉండి ఉంటే.. మరో రెండు వారాలు అయినా హౌస్ లో ఉండేది కదా అని నెటిజన్లు కూడా ముమైత్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక స్టేజ్ మీదకు రాగానే ముమైత్ తెగ కన్నీరు పెట్టేసుకుంది.

ఫస్ట్ సీజన్ లో తన పై పడిన బ్యాడ్ మార్క్ ను పోగొట్టుకోవడానికి ఇప్పుడు వచ్చాను అని, కానీ ఇప్పుడు కూడా అదే బ్యాడ్ మార్క్ తో ఇంటికి వెళ్లిపోతుండటం తనను చాలా బాధిస్తోంది అంటూ ముమైత్ ఎమోషనల్ అవుతూ సెలవిచ్చింది. ఇక తనకు అందరూ అగ్రెసివ్ అనే ట్యాగ్ ఇచ్చి.. కావాలనే బ్యాడ్ చేశారు అంటూ శివ, చైతూ, బిందు మాధవి, మిత్రా శర్మలను వేస్ట్ అనేసింది. చివరకు ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ లో ముమైత్ ప్రయాణం ఇలా ముగిసింది.