Saregamapa Show: పాట.. మనిషికి ప్రాణం పోస్తుంది.. ఆ గీతాలాపన మన టెన్షన్ ను దూరం చేస్తుంది. ఎంతటి ఒత్తిడి అయినా చిత్తు చేస్తుంది. ఆ పాటల పూదోటికి మరోసారి జీ తెలుగు నీళ్లు పోసింది. ఆ పూలు ఇప్పుడు గానామృతంతో విరబూస్తున్నాయి..తాజాగా మతసామరస్యానికి ప్రతీకగా ముస్లిం అయిన రసూల్, హిందూ అయిన శ్రీరామ్ లు పాడిన పాట వైరల్ అయ్యింది. జడ్జీలు కోటి, శైలజ, స్మిత, అనంత్ శ్రీరామల్ చేత చప్పట్లు కొట్టించింది. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

పాటలు పోటీపోటీగా పాడితే ఎంత మజా వస్తుందో కొత్త గాయకులు శ్రీరామ్, రసూల్ లు చూపించారు. సరిగమప షోలో వీరి పాట అలరించింది. ‘తాగరా శ్రీరామ నామామృతం’ అన్న పాట ఊపుఊపేసింది. ఈ పాటలో శ్రీరామ్, రసూల్ పోటాపోటీగా పాడారు. వారి పాటకు జడ్జీలు ఫిదా అయ్యారు.
రసూల్ ముస్లిం అయినా శ్రీరాముడిపై పాటను ఇరగదీశాడు. అతడు పేదరకంలోంచి వచ్చాడని గత ఎపిసోడ్ లోనే అందరికీ తెలిసింది. తన భార్య వెండి పట్టీలు అమ్మేసి మరీ తనను ‘సరిగమప షో’కు పంపిందని చెప్పుకొచ్చాడు. అప్పుడే రసూల్ కష్టాలకు కరిగిపోయిన జడ్జి స్మిత నిన్న ‘‘తాగరా శ్రీరామ నామామృతం’ అనే పాట పాడిన రసూల్ కు ఊహించని బహుమతిని అందించింది.
రసూల్ ఇక్కడికి రావడానికి ఆయన భార్య ఏదైతే వెండి పట్టీలు అమ్మేసిందో.. వాటి స్థానంలో కొత్త వెండి పట్టీలు అందించి స్మిత తన పెద్ద మనసు చాటుకుంది. అంతేకాదు.. ఆమె చిరకాల కోరిక అయిన నల్లపూసల బంగారు గొలుసును కానుకగా ఇచ్చింది.
పాటలు అందరూ పాడుతారు. కానీ ఆ సందర్భానికి తగ్గట్టుగా.. ఎన్నో కష్టాలను ఓర్చి ఈ స్థాయికి వచ్చిన శ్రీరామ్, రసూల్ లా ఈ పాట ఇప్పుడు శ్రోతలను ఉర్రూతలూగిస్తోంది. వారి పాటల మాయాజాలం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.youtube.com/watch?v=TgyzxPkA9kE