Ram Charan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో వరుస విజయాలను సాధిస్తూ పాన్ ఇండియాలో స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రామ్ చరణ్ (Ram Charan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయనకు రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమా రూపంలో ఒక భారీ డిజాస్టర్ అయితే వచ్చింది. ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందరికి బాగా నచ్చిన ఈ పోస్టర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాగా మారబోతుందనే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తూ ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ విజయాన్ని దక్కించుకుంటాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయా..?
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఇటు సినిమాలు చేస్తూ అటు రాజకీయంగా కూడా ముందుకు దూసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించాలని ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం మొదటి నుంచి కూడా రామ్ చరణ్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించాలని చెబుతూ ఉండేవాడు. అలాగే రామ్ చరణ్ కి తనకు మధ్య ఒక బాండింగ్ అయితే ఉందని పవన్ కళ్యాణ్ అవకాశం దొరికినప్పుడల్లా చెబూతుంటాడు… రామ్ చరణ్ నటించిన సినిమాల్లో మగధీర(Magadeera), రంగస్థలం (Rangasthalam) సినిమాలంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమని ఎప్పుడు చెబుతుంటాడు.
ఇక వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలి అని అందరూ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వీళ్లిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో వీళ్లిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందంటూ ప్రేక్షకులందరూ వల్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : పెద్ది సినిమాలో డ్యూయల్ లో రోల్ లో కనిపించనున్న రామ్ చరణ్…