Ram Charan : చరిత్రలో ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో కూడా చెయ్యని ప్రయోగం రామ్ చరణ్(Global Star Ram Charan) చేయబోతున్నాడా?, ఛాలెంజింగ్ రోల్స్ చేయడం లో అమితాసక్తిని చూపించే రామ్ చరణ్ ‘పెద్ది'(Peddi Movie) సినిమాతో ఫ్యాన్స్ మైండ్ ని బ్లాక్ చేయబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రేపు విడుదల ఉదయం 11 గంటల 45 నిమిషాలకు శ్రీరామ నవమి సందర్భంగా విడుదల కాబోతుంది. ఫైనల్ రీ రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ కూడా పూర్తి అయ్యినట్టు నిన్న ఈ చిత్ర డైరెక్టర్ బుచ్చిబాబు(Buchi Babu Sana) ఒక ట్వీట్ కూడా వేశాడు. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ పోషించే పాత్ర గురించి సోషల్ మీడియా లో ఇప్పటి వరకు ఎన్నో కథనాలు బయటకు వచ్చాయి. మొదట్లో ఇదొక బయోపిక్ అనే ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి నిజం లేదని బుచ్చి బాబు చెప్పడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది.
Also Read : రామ్ చరణ్ చేసిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమాలు ఇవేనా..?
ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ సినిమాలో రామ్ చరణ్ కి చెవులు పని చెయ్యవు, మాటలు కూడా రావు అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా ప్రచారం అవుతున్న మరో వార్త ఏమిటంటే ఇందులో రామ్ చరణ్ మరగుజ్జుగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. మరగుజ్జు అంటే అత్యంత పొట్టి వాడు అన్నమాట. ఇప్పటి వరకు ఇలాంటి క్యారక్టర్ లో కేవలం కమల్ హాసన్ మాత్రమే కనిపించాడు. స్టార్ హీరోలెవ్వరూ కూడా ఇలాంటి సాహసం చేసే ప్రయత్నం చేయలేదు. కానీ రామ్ చరణ్ మాత్రం సాహసం చేసాడని, కానీ దానిని అభిమానులు, ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అని టెన్షన్ పడుతున్నారు అభిమానులు. అయితే ఇవన్నీ కేవలం సోషల్ మీడియా లో వినిపించిన రూమర్స్ మాత్రమే. అసలు విషయం ఏమిటో రేపు తెలియనుంది. ఒకవేళ ఈ రోల్ చేస్తే మాత్రం రేపు సోషల్ మీడియా లో గోల మామూలు రేంజ్ లో ఉండదు.
ఇకపోతే ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Jhanvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. అదే విధంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం లో ఇంకా ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఫ్యాన్స్ కి పండగే అని అంటున్నారు. షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 125 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారట. ఇక ఆడియో రైట్స్ ని అన్ని భాషలకు కలిపి T సిరీస్ సంస్థ 35 కోట్ల రూపాయలకు కొన్నారట. సినిమా షూటింగ్ మొదలైన అతి తక్కువ సమయం లోనే 160 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది. రేపు టీజర్ విడుదల తర్వాత ఈ చిత్రంపై ఇంకెన్ని అంచనాలు ఏర్పడుతాయి చూడాలి.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయా..?