Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి రేపటి నుండి ప్రతీరోజు పండగే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇన్ని రోజులు ఆయన అభిమానులు ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రొమోషన్స్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూసారు. సినిమాకి కావాల్సిన రేంజ్ లో ప్రొమోషన్స్ చేయడం లేదు, ఇలా అయితే ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో ఉండవు, ఆరేళ్ళ నుండి ఎదురు చూస్తున్న రామ్ చరణ్ సోలో చిత్రం, అది కూడా #RRR లాంటి గ్లోబల్ సెన్సేషనల్ తర్వాత వస్తుంది, ఎలా అయితే ప్రొమోషన్స్ ఉండాలని కోరుకుంటున్నామో అలా లేదని ఆందోళన చేస్తూ ప్రతీ రోజు మేకర్స్ ని ట్యాగ్ చేసేవాళ్ళు. కానీ రేపటి నుండి హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కనీవినీ ఎరుగని రేంజ్ ప్రొమోషన్స్ చేయబోతున్నారు. #RRR సమయంలో ఎలా అయితే ప్రొమోషన్స్ కోసం సమయాన్ని కేటాయించారో, ఈ చిత్రానికి కూడా అలాంటి సమయం ఇవ్వనున్నారు.
రేపు హిందీ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఒక అతిథిగా రాబోతున్నాడు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ప్రమోషన్ చేయనున్నాడు. రేపు ఉదయం ఆయన అందుకోసం ముంబై కి వెళ్లనున్నాడు. రామ్ చరణ్ తో పాటు డైరెక్టర్ శంకర్, హీరోయిన్ కైరా అద్వానీ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ మరుసటి రోజు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, సాయంత్రం రాజమండ్రి లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాబోతుంది మూవీ టీం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే తమిళం లో కూడా ఈ చిత్రానికి గ్రాండ్ లెవెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రావాలని సూపర్ స్టార్ రజినీకాంత్, తలపతి విజయ్ లను నిర్మాత దిల్ రాజు ఆహ్వానించాడని, వాళ్ళు వచ్చేందుకు సుముఖత చూపించారని తెలుస్తుంది. ఈ ఈవెంట్ తర్వాత తమిళనాడు లో కూడా ఈ చిత్రం ఓపెనింగ్స్ దంచి కొడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. ఎందుకంటే అక్కడ శంకర్ కి మంచి క్రేజ్ ఉంది, అదే విధంగా రామ్ చరణ్ కి కూడా మగధీర చిత్రం నుండి తమిళనాడు లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన హీరో గా నటించిన రచ్చ సినిమాని తమిళం లో దబ్ చేసి విడుదల చేస్తే పెద్ద హిట్ అయ్యింది. చూడాలి మరి ఈ ప్రొమోషన్స్ సినిమాకి ఏ రేంజ్ బూస్ట్ ఇస్తుంది అనేది.