https://oktelugu.com/

Game Changer Trailer: అందరూ సంక్రాంతి అంటున్నారు..కాదు..ఇది ‘రామ’ నవమి అంటూ రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తిన శంకర్!

శంకర్ గేమ్ చేంజర్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి ఆయన పేరుపేరున చెప్పుకొచ్చాడు. వాళ్ళ పని తనం గురించి సుమారుగా 16 నిమిషాల పాటు మాట్లాడాడు. ఆయన ఇచ్చిన ఈ స్పీచ్ లో ముఖ్యంశాలు కొన్ని చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : January 2, 2025 / 09:25 PM IST

    Game Changer Trailer(8)

    Follow us on

    Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలై ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఆరేళ్ళ అభిమానుల ఆకలి కి భుక్తాయాసం వచ్చే రేంజ్ లో ఫుల్ మీల్స్ పెట్టబోతున్నట్టు ఈ ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని AMB సినిమాస్ లో మీడియా రిపోర్టర్స్ సమక్షంలో విడుదల చేసారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా శంకర్ గేమ్ చేంజర్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి ఆయన పేరుపేరున చెప్పుకొచ్చాడు. వాళ్ళ పని తనం గురించి సుమారుగా 16 నిమిషాల పాటు మాట్లాడాడు. ఆయన ఇచ్చిన ఈ స్పీచ్ లో ముఖ్యంశాలు కొన్ని చూద్దాం.

    ముందుగా ఆయన రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘నాకు పోకిరి, ఒక్కడు సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి సినిమాలను ఎప్పుడైనా తియ్యాలి అని నాలో ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ని నేను ‘గేమ్ చేంజర్’ ద్వారా తీర్చుకున్నాను. ఇందులో రామ్ చరణ్ గారు ఎంతో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం, కేవలం ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారు, ఆ రేంజ్ లో ఉన్నాడు ఆయన. అందరి ఇది సంక్రాంతి అని అంటున్నారు. కాదు, ఇది రామనవమి’ అంటూ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక హీరోయిన్స్ గా నటించిన కైరా అద్వానీ, అంజలీ గురించి మాట్లాడుతూ ‘కైరా అద్వానీ ఈ చిత్రం చాలా అందంగా ఉంటుంది. ఆమె రామ్ చరణ్ తో పోటీ పడి డ్యాన్స్ వేసింది’ అంటూ చెప్పుకొచ్చారు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అంజలి గారి నటన చూసి నాకు ఆశ్చర్యమేసింది. ప్రతీ సన్నివేశం లో ఆమె నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పొచ్చు. ఆమె క్యారక్టర్ ఇచ్చే ట్విస్టు మామూలు రేంజ్ లో ఉండదు, థియేటర్స్ లో మీరంతా షాక్ కి గురి అవుతారు’ అంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాత దిల్ రాజు గురించి మాట్లాడుతూ ‘నేను ఏది కోరితే అది అందించాడు. డబ్బులు నీళ్లు లాగా ఖర్చు చేసాడు. కేవలం డబ్బులు పెట్టడం ఒక్కటే కాదు, ప్రతీ రోజు ఆయన సెట్స్ లో ఉండేవాడు. ప్రతీ డిపార్ట్మెంట్ ని ఆయన ముందుండి పుష్ చేసేవాడు. నాకు ఇంత సపోర్టుగా నిలిచినందుకు ధన్యవాదాలు’ అంటూ దిల్ రాజు గురించి చెప్పుకొచ్చాడు. ఇక మిగిలిన తారాగణం, టెక్నీషియన్స్ గురించి ఆయన ఏమి మాట్లాడాడో మీరే ఈ క్రింది వీడియోలో చూడండి. తెలుగు లో ఆయన ఇంత స్పష్టంగా మాట్లాడుతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.