Ram Charan Flop Movie Story: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలు ప్రస్తుతం వాళ్లు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటితో ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతున్నారు. ఇక రామ్ చరణ్ చేసిన ఒక ఫ్లాప్ సినిమాని మొదట వేరే హీరోతో చేయాలనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ రామ్ చరణ్ దగ్గరికి రావడం ఆ సినిమా డిజాస్టర్ గా మారడంతో ఆ హీరో అయితే ఆ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు ఆ సినిమా ఏంటి అనేది తెలుసుకుందాం…రామ్ చరణ్ హీరోగా అపూర్వ లాకీయా దర్శకత్వంలో వచ్చిన జంజీర్ (తుఫాన్) సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. మొదట ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నారట.
Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక..
జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అపూర్వ లాకీయా ఈ కథను చెప్పడం ఒకప్పుడు అమితాబచ్చన్ చేసిన జంజర్ సినిమాని మళ్లీ రీమేక్ చేస్తున్నామని చెప్పడంతో ఎన్టీఆర్ చాలా వరకు సందిగ్ధ పరిస్థితిలో పడ్డారట.
ఎలాగైనా సరే ఆ సినిమాని ఎన్టీఆర్ తో చేయాలని అప్పుడు అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేదు. దాంతో అప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా రామ్ చరణ్ తో సినిమా వర్కౌట్ అవుతుందని చిరంజీవికి రాంచరణ్ కి వినిపించి అతని చేత సినిమాని చేయించారు.
మొత్తానికైతే సినిమా డిజాస్టర్ గా మారింది. ఇక ఈ ఫ్లాప్ సినిమా నుంచి ఎన్టీఆర్ తప్పించుకున్నాడు అంటూ తన అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు…
