Pawan Kalyan- Ram Charan: పవన్ కల్యాణ్ ఏదైనా సభ పెడితే కంటికి కనిపించేంతా జనం వస్తారు.. నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిస్తారు.. పవన్ ను ఒక్కసారైనా తాకాలని పరితపిస్తుంటారు.. కానీ పవన్ కల్యాణ్ కోసం 100 మంది బౌన్సర్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారిని తన అన్న కొడుకు, స్టార్ హీరో రామ్ చరణ్ అరేంజ్ చేసినట్లు సమాచారం. ఇటీవల పవన్ కల్యాణ్ కు చెందిన ఓ న్యూస్ హల్ చల్ చేసింది. ఆయన ఇంటి ముందు కొందరు యువకులు కారుతో చేసిన అలజడి రచ్చయింది. పవన్ బౌన్సర్లతో యువకులు పడిన వివాదం ఘర్షణ వరకు దారి తీసింది. దీంతో స్టార్ నటుడు రామ్ చరణ్ ఈ విషయంలో జోక్యం చేసుకొని భౌన్సనర్లకు మద్దతుగా మరికొంత మందిని తీసుకొచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

జూబ్లీహిల్స్ లోని పవన్ ఇంటిముందు గురువారం అర్ధరాత్రి కొందరు యువకులు తమ కారును ఆపారు. అయితే పవన్ కల్యాణ్ బౌన్సర్లు ఆ యవకులను అక్కడి నుంచి కారు తీయాలని కోరారు. కానీ వారు ఆ బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. శ్రీరాంనగర్ కు చెందిన సాయికృష్ణ చౌదరి, జవహర్ నగర్ కు చెందిన విజయ్ ఆదిత్య, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ హోటల్ లో జరిగిన విందుకు హాజరయ్యారు. ఆ తరువాత వీరు పవన్ కల్యాణ్ ఇంటిముందు కారు ఆపారు. అయితే సాయికృష్ణ, విజయ్ ఆదిత్య బౌన్సర్లతో గొడవ పడినట్లు సమాచారం.
దీంతో ఆ యువకులపై బౌన్సర్ల పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్టు చేశారు. అయితే ఆ యువకుల నుంచి మరే వాగ్వాదం చోటు చేసుకోకుండా రామ్ చరణ్ రంగంలోకి దిగినట్లు అంటున్నారు. తనకు తెలిసిన 100 మంది భౌన్సర్లను వారికి సపోర్టుగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న పవన్ కు ఎటువైపు నుంచైనా ప్రమాదం ఉందనే నేపథ్యంలో పవన్ అన్న కొడుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు పవన్ వరకు ఈ విషయం చేరిందా..? లేదా..? అనేది తెలియదు. ఈ విషయాన్ని తామే చూసుకుంటామని భౌన్సర్లు పవన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ విశాఖ పర్యటన సందర్భంగా అక్కడ జరిగిన ఘర్షణలో భాగంగానే ఈ యువకులు పవన్ ఇంటి ముందుకు వచ్చారా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారిపై ఐసీసీ సెక్షన్ 341, 323, 506 కింద కేసు నమోదు చేశారు.