Sreemukhi: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి టీవీ షోల్లో అల్లరి మాములుగా ఉండదు. స్టేజీపైకి ఆమె రాగానే కుర్రాళ్లలో జోష్ పెరుగుతుంది. మిరపకాయ లాంటి పంచ్ లతో శ్రీముఖి యాంకరింగ్ అంటే లైక్ చేయనివారుండరు. యాంకర్ గానే కాకుండా ఈ అమ్మడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మల్లీ బుల్లితెరపైనే రారాణిగా కొనసాగుతూ మంచి అవకాశాలు తెచ్చుకుంటోంది. ఇటీవల అమెరికా వెళ్లిన సందర్భంగా నెట్టంట్లో ఆమె చేసిన సందడికి అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా ఆమె ఫొటోస్ తో మత్తెక్కుతుందని కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖి ఇటీవల కొన్ని హాట్ పిక్స్ కు ఫోజులిచ్చింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

టీవీ షో ల ద్వారా స్టార్లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అనసూయ, రష్మీ, విష్ణుప్రియ లాంటి వారు తమ యాంకరింగ్ తో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వీరి బాటలోనే ‘పటాస్’ అనే కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది శ్రీముఖి. ఆ తరువాత పలు షోల్లో కనిపించి ఆకట్టుకుంది. తనదైన పంచ్ లతో పాటు డ్యాన్స్ చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ క్రమంలో ఆమె అందంగా తయారవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
సినిమాలు, టీవీ షోల్లో బిజీ అయినా శ్రీముఖికి సోషల్ మీడియా వ్యసనం కూడా ఉంది. ఎప్పటికప్పుడు తన విషయాలను ఈ వేదిక ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అందచందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోజులు పెట్టి ఫొటోలు దిగుతుంది. గతంలో ఓ పేపర్ డ్రెస్ వేసుకొని దిగిన ఫొటోలు నెట్టింట్లో రచ్చ చేశాయి. ఆ సమయంలో శ్రీముఖ ఇక సినిమాల్లో అవకాశాలు వచ్చాయని అన్నారు. కానీ అమ్మడుకు అనసూయ, రష్మీలతో పోలిస్తే అవకాశాలు తక్కువే అని చెప్పాలి.

అయితే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎద అందాలను ఆరబోసి కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మాములుగానే మంచి ఫిజిక్ ఉన్న శ్రీముఖి తన అందాలను ఆరబోయడంతో యూత్ ఆగలేకపోతున్నారు. బుల్లితెర అల్లరి పిల్లగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి అందాలను చూసి ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి..? అని ప్రశ్నిస్తున్నారు.