Music Director Devi Sri Prasad: టాలీవుడ్ లోనే కాదు తన అద్భుతమైన సంగీతం తో యావత్తు ఇండియన్ మూవీ లవర్స్ ని అలరిస్తున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కి ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..గత ఏడాది ఆయన సంగీత సారథ్యం లో రూపు దిద్దుకున్న పుష్ప మూవీ పాటలు దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా పాటలు ద్వారా ఆయన నేషనల్ స్థాయి ని దాటి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఈ సినిమాలోని పాటలకు ప్రముఖ ఇండియన్ క్రికెటర్స్ కూడా డ్యాన్స్ వెయ్యడం మన అందరం చూసాము..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన పుష్ప ది రూల్ కి సంగీతం అందించబోతున్నాడు..అంతతి ప్రఖ్యాతలు గాంచిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు చికుక్కలో పడబోతున్నాడా..అతని కెరీర్ రిస్క్ లో పడనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..ఇటీవలే ఆయన సంగీతం అందించిన ‘ఓ పరి’ అనే ఆల్బం అతనికి పెద్ద తలనొప్పులు తెచ్చి పెట్టింది.
ఇక అసలు విషయానికి వస్తే ‘హరే రామ హరే కృష్ణ’ వంటి పవిత్రమైన మంత్రాన్ని ‘ఓ పరి’ అనే ఆల్బం లో ఐటెం సాంగ్ కోసం వాడారని..మహోన్నతమైన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఆ సాంగ్ ని తక్షణమే తొలగించాలని..లేనిచో దేవిశ్రీప్రసాద్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ నటి కరాటీ కళ్యాణి హిందూ సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ పాట ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యగా తెలుగు లో ఓ పిల్ల అనే పేరుతో విడుదల అయ్యింది..మరి దీనిపై దేవిశ్రీప్రసాద్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..పోలీసులు ఆయన పై కఠిన చర్యలు తీసుకోబోతున్నారా లేదా అనేది చూడాలి.

