
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.#RRR మూవీ కి ఇంటర్నేషనల్ అవార్డ్స్ మరియు ఆస్కార్ అవార్డ్స్ రావడం తో అంతర్జాతీయ మీడియా రాజమౌళి తర్వాత రామ్ చరణ్ ని #RRR కి ఫేస్ గా పరిగణిస్తూ ప్రమోట్ చేసారు.ఇది మెగా అభిమానులకు ఎంతో గర్వకారణం లాంటిది, అందుకే రామ్ చరణ్ ని అమెరికా మెగా ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేసారు.
ఆయనని కలిసి చాలాసేపటి వరకు ముచ్చటించారు.దానికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.అయితే రామ్ చరణ్ ని ప్రత్యేకంగా సన్మానించుకోవాలి అనుకున్నారు ఫ్యాన్స్.అందుకోసం గా ఆయనకీ ఒక ప్రత్యేక కుర్చీ ని ఏర్పాటు చేసారు.కానీ రామ్ చరణ్ అందులో కూర్చునేందుకు నిరాకరించాడు.అభిమానులతో నిలబడే కావాల్సినంత సేపు మాట్లాడాడు.రామ్ చరణ్ లో ఉన్న ఈ సింప్లిసిటీ ని గమనించి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.
ఇక ఆస్కార్ అవార్డ్స్ వేడుక అయిపోయిన వెంటనే రామ్ చరణ్ తో పాటుగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నేడు ఇండియా కి తిరిగి వచేసాడు.ఆయన ఈరోజు బేగంపేట విమానాశ్రయం లో దిగిన ఫోటోలు మరియు వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.కానీ రామ్ చరణ్ మాత్రం ఇంకా అమెరికాలోనే ఉన్నాడు.రేపు ఆయన ఇండియా కి రాబోతున్నాడు.ఆయనని గ్రాండ్ గా వెల్కమ్ చెయ్యడానికి అభిమానులు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఎల్లుండి రామ్ చరణ్ ఇండియా టుడే నిర్వహిస్తున్న ఒక ప్రత్యేకమైన మీటింగ్ లో పాల్గొనబోతున్నారు.అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పేరుని నిలబెట్టిన వారిలో ఒకరైన రామ్ చరణ్ కి ప్రత్యేక సన్మానం కూడా చేయబోతున్నట్టు సమాచారం.ఈ మీటింగ్ కి రామ్ చరణ్ తో పాటుగా , పలువురు సినీ నటులు మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కాబోతున్నాడు.