Ram Charan : ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ కి కూడా స్టార్ హీరో తో సినిమాలు చేసి సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యమైతే ఉంటుంది. కానీ కొంతమంది దర్శకులు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికి వాళ్లకు సరైన గుర్తింపు అయితే రాదు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన సినిమాలు ఆయా హీరోలకు అంత బాగా సెట్ అవ్వకపోవడం ఆ సినిమాలు సూపర్ సక్సెస్ లని సాధించకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక సంపత్ నంది (Sampath Nandi) లాంటి దర్శకుడు సైతం రామ్ చరణ్ (Ram Charan) తో రచ్చ (Rachha) అనే ఒక సినిమా చేసి భారీ విజయాన్ని సాధించాడు. దాదాపు ఈ సినిమా అప్పట్లో 50 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. కానీ ఈ సినిమా తర్వాత అతని కెరీర్ అంత సాఫీగా అయితే సాగడం లేదు. వరుసగా ప్లాప్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక తను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు సైతం వరుసగా ప్లాప్ అవుతుండడంతో ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి అనే ఒక డైలామాలో పడినట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ లాంటి నటుడితో సూపర్ సక్సెస్ ని అందుకున్న తర్వాత ఆయన కెరియర్ అనేది సాఫీగా సాగాలి.
Also Read : మరోసారి కాజల్ అగర్వాల్ తో రామ్ చరణ్ రొమాన్స్..కానీ ట్విస్ట్ ఏమిటంటే!
కానీ చేతులారా ఆయన తన కెరీర్ ను నాశనం చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు కొంచెం వైవిధ్యాన్ని కనబరిచి మంచి విజయాన్ని సాధించినట్లయితే ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపైతే ఉండేది. కానీ ఇప్పుడు ఆయన అలాంటి సక్సెస్ లను సాధించలేకపోయారు. కాబట్టి ఆయన చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించి మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆయన కెరీర్ అనేది సాఫీగా సాగుతుంది. లేకపోతే మాత్రం డైలామా లో పడిపోయే పరిస్థితి రావచ్చు. చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి కంపాక్ట్ ఇస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది…
రీసెంట్ గా ఆయన చేసిన ఓదెల 2(Odela 2) సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ఈ సినిమాకి కథ మాటలు అందించిన ఆయన కథలో గాని మాటల్లో గాని ఏమాత్రం వైవిధ్యం అయితే ప్రదర్శించలేకపోయాడనే చెప్పాలి.
Also Read : అంతరిక్షం లోకి రామ్ చరణ్ ‘పెద్ది’..సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!