Ram Charan and Kajal Aggarwal : వెండితెర పై మన టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ జంటల లిస్ట్ తీస్తే అందులో రామ్ చరణ్(Global Star Ram Charan), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) జంట ముందు వరుసలో ఉంటుంది. ‘మగధీర’ చిత్రం లో మొట్టమొదటిసారి వీళ్లిద్దరు కలిసి నటించారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యాక, మళ్ళీ వీళ్లిద్దరు కలిసి నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో నటించారు. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఉపాసన ఈ విషయంలో రామ్ చరణ్ తో గొడవ పెట్టుకుంది అనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగింది. ఇక ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కలిసి సినిమాలు చేయలేదు. కానీ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన ‘ఖైదీ నెంబర్ 150’ మళ్ళీ కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు.
ఆ తర్వాత ఆయన నిర్మాతగా వ్యవహరించిన మరో సినిమా ‘ఆచార్య’ లో కూడా కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత కథకు ఆమె పాత్ర అవసరం లేదని మధ్యలో డైరెక్టర్ కొరటాల శివ తీసేసాడు. అలా వీళ్లిద్దరి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉండేది. అయితే ఇప్పుడు స్టార్ హీరోలందరూ కొత్త హీరోయిన్స్ ని తమ సినిమాల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఇక మీదట కాజల్ అగర్వాల్ తో కలిసి నటించడం కష్టమే అని అనుకున్నారు. కానీ ఈ బ్లాక్ బస్టర్ జోడి మరోసారి మన ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది'(Peddi Movie) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చి బాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. అయితే ఈ చిత్రం ఒక మంచి ఐటెం సాంగ్ ఉందట. త్వరలోనే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ మొదలు కాబోతుంది.
ఈ సాంగ్ లో రామ్ చరణ్ తో కలిసి కాజల్ అగర్వాల్ చిందులు వేయనుంది. ముందుగా శ్రీలీల ని తీసుకోవాలని అనుకున్నారు కానీ, రామ్ చరణ్ కాజల్ పేరుని చెప్పడం తో డైరెక్టర్ ఆమెని సంప్రదించాడట. కాజల్ కూడా ఈ పాట చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో మాత్రమే ఐటెం సాంగ్ చేసింది. ‘పక్కా లోకల్’ అంటూ సాగే పాట అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మళ్ళీ కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్స్ జోలికి పోలేదు. వేరే హీరో సినిమా అయ్యుంటే ఆమె ఐటెం సాంగ్ చేయడానికి ఆలోచించేది ఏమో కానీ, రామ్ చరణ్ సినిమా కోసం అని అడిగిన వెంటనే చేయడానికి ఒప్పుకుందట. దాదాపుగా నాలుగు సినిమాల తర్వాత మళ్ళీ ఈ బ్లాక్ బస్టర్ జోడి ని వెండితెర పై చూడబోతున్నారు ఫ్యాన్స్.
Also Read : చీరైన, పొట్టి డ్రెస్ అయినా కత్తిలా ఉంటుంది బ్రో కాజల్..