Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చి బాబు తో కలిసి ‘పెద్ది'(Peddi Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి శ్రీరామనవమి సందర్భంగా ఒక చిన్న గ్లింప్స్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో సృష్టించిన ప్రభంజనం సాధారణమైనది కాదు. ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తో డీలా పడిన అభిమానులకు సరికొత్త ఉత్సాహం ని తెచ్చి పెట్టింది ఈ చిత్రం. కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు అవ్వడమే కాకుండా, రామ్ చరణ్ ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా కొల్లగొడుతాడని అభిమానులు చాలా గర్వంగా చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు అయినటువంటి మార్చి 27న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని ఈ చిత్రానికి అమ్ముడుపోయాయి.
Also Read : మరోసారి కాజల్ అగర్వాల్ తో రామ్ చరణ్ రొమాన్స్..కానీ ట్విస్ట్ ఏమిటంటే!
ఇదంతా పక్కన పెడితే ఈ గ్లింప్స్ వీడియో పై ఎన్నో వేల ఎడిట్స్ సోషల్ మీడియా లో వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది క్రికెట్ ఆటగాళ్లు పెద్ది షాట్ ని ప్రయత్నం చేశారు కూడా. అయితే అన్ని ఎడిట్స్ లోకి ఒక ఎడిట్ మాత్రం ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ ఇలా అన్ని చోట్ల సెన్సేషనల్ గా మారింది. యూట్యూబ్ మరియు ఇన్ స్టాగ్రామ్ లో జోష్ క్రియేషన్స్ అనే ఛానల్ ఒకటి ఉంటుంది. ఈ ఛానల్ లో కొత్తగా విడుదలైన టీజర్స్, ప్రోమోస్ ని ఇమిటేట్ చేస్తూ గ్రీన్ మ్యాట్ వేసి క్రియేటివ్ గా తనకు తోచిన విధంగా ఎడిటింగ్స్ చేస్తూ ఉంటారు. అలా పెద్ది మూవీ గ్లింప్స్ కి కూడా ఒక ఎడిటడ్ వీడియో చేసాడు. ఇందులో జోష్ అనే అతను రామ్ చరణ్ కి బౌలింగ్ వెయ్యబోతుంటాడు.
ఆయన బౌలింగ్ వేసేలోపు రామ్ చరణ్ బ్యాట్ క్రిందకు కొడుతూ, ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ అంతరిక్షంలోకి వెళ్తాడు. అక్కడ ఆయన బాల్ కి బదులుగా, ఆస్ట్రోనట్ ని బ్యాట్ తో కొడుతాడు. చూసేందుకు ఎంతో ఫన్నీ గా అనిపిస్తున్న ఈ వీడియో ని రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా లో పెద్ది గ్లింప్స్ పై ఎన్నో వీడియోలు వచ్చాయి కానీ అన్నిట్లోకి ఇది హైలైట్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో ని చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ‘పెద్ది’ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదే విధంగా ఈ సినిమాలోని స్పెషల్ ఐటెం సాంగ్ లో కాజల్ అగర్వాల్ నర్తించబోతున్నట్టు సమాచారం.
Also Read : అలియా భట్ నిర్మాతగా రామ్ చరణ్ కొత్త సినిమా..? డైరెక్టర్ ఎవరంటే!