Ram Charan
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తనయుడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. త్రిబుల్ ఆర్ (RRR) సినిమాతో ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగడమే కాకుండా ‘గ్లోబల్ స్టార్’ గా కూడా అవతరించాడు. ప్రస్తుతం ఆయన సినిమాలను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకునే సినిమాలనే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ఆర్సి 16 గా వాడుకలోకి వచ్చిన ఈ సినిమా టైటిల్ ను ఈ రోజే అనౌన్స్ చేశారు…ఈ సినిమాకు ‘పెద్ది’ (Peddi) అనే పేరును ఫైనల్ చేశారు…ఇక దానికి సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు…ఈ పోస్టర్ ను చూస్తే రామ్ చరణ్ నోట్లో బీడి పెట్టుకొని ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించడమే కాకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమా ఉండబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ లుక్ లో రామ్ చరణ్ ని మనం గమనించినట్లయితే ఆయన ఒక రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. దేనికోసమో ఆయన తీవ్రమైన పోరాటం చేసే ఒక వ్యక్తిలా కనిపిస్తున్నాడు…
Also Read : రామ్ చరణ్ బర్త్ డే కి రచ్చ రచ్చ చేయనున్న అభిమానులు…
ఒక భయం లేని యుద్ధం చేసే యోధుడిగా మనకు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి రామ్ చరణ్ ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఒక లుక్ లో అయితే కనిపించలేదు. కాబట్టి ఆయన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని ఎంచుకొని ఈ సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి రామ్ చరణ్ ఈ సినిమా మీద చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుంది అనే విషయం పక్కన పెడితే నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించి పెట్టడమే కాకుండా నటుడిగా తనను మరొక మెట్టు పైకి ఎక్కిస్తుంది అంటూ చాలా కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తాడని అతని అభిమానులైతే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ తన పవర్ ను చూపించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. కాబట్టి ఈ సినిమాతో తన స్టామినా మొత్తాన్ని చూపించబోతున్నాడనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది…
Also Read : 2వ సారి తల్లైన రామ్ చరణ్ హీరోయిన్..వైరల్ అవుతున్న ఫోటోలు!