Ram Charan bad habit: ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… అందులో భాగంగానే ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలతో చేస్తున్నారు.తను అనుకున్న విజయం ఈ సినిమా సాధించి పెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ కి ఒక హ్యాబిట్ ఉందట. చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ను ఎంత మార్చుకోవాలని చూసిన కూడా అది మారడం లేదట… అది ఏంటి అంటే ఆయనకి కొంచెం చిన్న చిన్న విషయాల్లో మతిమరుపు ఉంటుందట. కొన్ని విజయాలను మర్చిపోతూ ఉంటాడట. గట్టిగా గుర్తుపెట్టుకోవాలి అని చాలాసార్లు ప్రయత్నం చేసినా కూడా అది ఆయన వల్ల కావడం లేదట…
స్కూల్లో పెన్నులు, పెన్సిల్లు మర్చిపోయేవాడట ఇక ఇప్పుడు సినిమా షూటింగ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పేర్లు చెప్పినా కూడా వాటిని మర్చిపోతూ ఉంటాడని ఆయనే స్వయంగా ఒక సందర్భంలో చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా వీలైనంత తొందరలో హాబిట్ ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తను అనుకున్నట్టుగానే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
Also Read: ‘పెద్ది’ ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్.. 4 నిమిషాల కోసం ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఎంతంటే!
మొత్తానికైతే ఆయన సినిమా పనుల్లో బిజీగా ఉంటూనే ఆ బిజీ వల్ల కొన్ని మర్చిపోతాడని చెబుతున్నారు. కానీ చిన్నతనం నుంచే ఆయన చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటాడు అనే విషయం అయితే తన సన్నిహితులు చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన గత సంవత్సరం చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు పెద్ది సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను సాధించి ఆ తర్వాత చేయబోయే సినిమాలు భారీ రేంజ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది…