Kodali Nani latest comments: వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నారని ఆయన తల్లి విజయమ్మ ఆవేదనతో ఉన్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం చంద్రబాబుకు దీనిని అంటగడుతున్నారు. ఆయన ప్రేరేపించడం వల్లే విజయం మాట్లాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. కొడాలి నాని లాంటి వారు అయితే జగన్మోహన్ రెడ్డి తన ఆస్తిపాస్తులను ఎప్పుడూ ఇచ్చేశారని.. ఆయన గొప్ప ఆదర్శవంతమైన సోదరుడు అంటూ చెబుతున్నారు. అయితే అది ఆస్తివాదమే కాబట్టి పరిష్కరించుకోవచ్చు కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆదర్శ సోదరుడు అంటూ సర్టిఫికెట్..
కొడాలి నాని( Kodali Nani) లాంటి వారు కూడా జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వడం చూస్తుంటే పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందో ఇట్టే అర్థమవుతుంది. కుటుంబ వ్యవహారం కావడంతో వైసీపీ నేతలు మాట్లాడకపోవడమే ఉత్తమం. కానీ జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉంటే మాత్రం.. కచ్చితంగా జగన్ ప్రోత్సాహం ఉందని ఇట్టే అర్థమవుతుంది. ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడడమే కాదు సాక్షిలో కూడా విజయమ్మకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు ప్రేరేపితం అని చెబుతూనే.. వారికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇటువంటి కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవడమే మేలు. కానీ జగన్మోహన్ రెడ్డి దానిని మర్చిపోయారు. విజయమ్మతో పాటు షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని సొంత పార్టీ నేతలతో మాట్లాడిస్తున్నారు.
Also Read: జగన్ బొక్కాబోర్లా పడ్డ తర్వాత కూడా అర్థం కావడం లేదు.. ఏంటో ఈ తమిళ రాజకీయాలు
ఆవేదనతో చెప్పుకున్న విజయమ్మ..
తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తన కుమార్తె షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నారని దేవుడు మీద ప్రమాణం చేస్తూ కూడా చెప్పారు విజయమ్మ. అందుకే ఇప్పుడు ఆమె సాక్షికి సైతం టార్గెట్ అవుతున్నారు. సాక్షి మీడియాలో అయితే విజయమ్మకు వ్యతిరేకంగా పతాక శీర్షికన కథనాలు వస్తున్నాయి. దారుణాతి దారుణంగా ఈ కథనాలు ఉంటున్నాయి. అయితే ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అది కూడా వివాదాస్పదం ముద్ర ఉన్న కొడాలి నాని లాంటి వారు మాత్రం మాట్లాడుతుండడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకునే స్థితిలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అది వదిలి తిరిగి ఆరోపణలతో పాటు సొంత మీడియాలో వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అంటే.. ఈ ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.