Pawan Kalyan movie success formula: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ‘ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన కూడా వాళ్ళ అన్నయ్య ఇమేజ్ ను ఏమాత్రం వాడుకోకుండా తన స్వశక్తి తో ఎదిగి స్టార్ హీరోగా మారాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నప్పటికి సినిమాలను సైతం పక్కన పెట్టలేదు. అవకాశం దొరికిన ప్రతిసారి వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తన అభిమానులను ఆనందపరచడానికి ఆయన చాలావరకు శ్రమిస్తున్నాడనే చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కొంతవరకు డివైడ్ టాక్ ను తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ ఆరాని వాడుకొని ఈ సినిమాని తెరకెక్కించాడు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తానని తను ఏదైతే చెప్పాడో అదే స్క్రీన్ మీద చూపించాడు.
అలాంటప్పుడు డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది అంటూ చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయి అనే విషయం మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
Also Read: 4 రోజుల్లో 700 కోట్లు.. తెలుగు రాష్ట్రాల నుండి ‘ధురంధర్ 2’ రాబట్టిన వసూళ్లు ఎంతంటే!
గత సంవత్సరం వచ్చిన ‘ఓజీ’ సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిందని చాలా వరకు కామెంట్లు చేశారు. మరి ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తాన్ని హై వోల్టేజ్ తో తెరకెక్కించినప్పటికి సినిమా కథ రొటీన్ గా ఉందని సినిమా అనుకున్న రేంజ్ లో లేదని కామెంట్లైతే చేస్తున్నారు.
మరి నిజానికి పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ ఎవరికి రావడం లేదు. ఇక దానికి తోడు పవన్ కళ్యాణ్ తక్కువ డేట్స్ కేటాయిస్తారు. కాబట్టి ఆ డేట్స్ లో షూట్ చేసుకొని అనుకున్న టైమ్ కి పూర్తయ్యే విధంగా ప్లాన్ చేసుకొని సక్సెస్ సాధించడం అనేది కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి…