Chiranjeevi , Ram charan
Ram Charan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి దాదాపు 50 సంవత్సరాలు నుంచి తనను బీట్ చేసే హీరో లేకపోవడంతో అప్పటినుంచి ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సినిమాలన్నీ ఆయనను చాలా ఉన్నత శిఖరంలో నిలిపే ప్రయత్నం అయితే చేశాయి. ఇక ఇప్పటికి ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం అయిన విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటాడనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ ను కనుక చూసినట్లయితే చిరంజీవి చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఇది చూస్తే వింటేజ్ చిరంజీవిని మనం ఈ సినిమాలో చూడబోతున్నాం అనేది చాలా క్లారిటీగా తెలుస్తోంది.ఇక చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ సైతం ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన తను చేసిన ప్రతి సినిమాతో భారీ వసూళ్లను రాబడుతున్నాడు. తన ప్లాప్ సినిమాకి సైతం వందల కోట్ల కలెక్షన్స్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
Also Read : సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!
మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట మనం చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా సక్సెస్ సాధించే విధంగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక చిరంజీవి చేసిన సినిమాల్లో రామ్ చరణ్ కి నచ్చిన రెండు సినిమాలు ఏంటి అంటే ఒకటి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కాగా, మరొకటి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అని తను చెబుతుండడం విశేషం…ఈ రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. చిరంజీవికి స్టార్ డమ్ ను అందించడం లో ఈ రెండు సినిమాలు చాలా వరకు కీలక పాత్ర వహిస్తాయి.
మరి ఏది ఏమైనా కూడా మెగాస్టార్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక ఈ ఏజ్ లో కూడా చిరంజీవి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే చిరంజీవికి సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు…
Also Read : రామ్ చరణ్ ని టార్గెట్ చేసిన నాని..వెనకడుగు వేసేది ఎవరు?