Tamannaah Bhatia
Tamannaah Bhatia: ఎలాంటి పాత్రని అయినా అలవోకగా చేయగల సత్తా ఉన్న అతి తక్కువమంది టాప్ హీరోయిన్స్ లో ఒకరు తమన్నా(Tamannaah Bhatia). అందం, డ్యాన్స్, నటన ఈ మూడు ఒకే హీరోయిన్ లో ఉండడం చాలా కష్టం. కానీ తమన్నా లో ఆ మూడు ఉన్నాయి. హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేసిన తమన్నా ఈమధ్య కాలంలో ఎక్కువగా తమిళం, హిందీ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. చాలా కాలం తర్వాత ఆమె తెలుగు లో చేసిన చిత్రం ‘ఓదెల 2′(Odela 2). ఆహ మీడియాలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. విడుదలకు ముందే బిజినెస్ విషయం లో హాట్ టాపిక్ గా నిల్చిన ఈ చిత్రం, వచ్చే నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు..మధ్యలోనే ఆగిపోయిన సినిమా!
ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తమన్నా మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘నేను అందరూ తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. అలా అనుకోవడం నా అదృష్టం. నాకు మనసులో నుండి ఏ చిన్న ఎమోషన్ వచ్చినా నేను తెలుగు లోనే మాట్లాడుతాను. నాకు తెలుగు అంతలా అలవాటు అయిపోయింది. కోపం వచ్చినప్పుడు కూడా తెలుగులోనే మాట్లాడుతాను. ఇక ఓదెల 2 విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని మీ అందరికీ నచ్చేలా తీసాము. మీకు తెలుసు ఈమధ్య కాలం లో నా నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ తెలుగు లో రాలేదని. ఈ చిత్రం ఆ లోటు ని తీరుస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు నన్ను బాగా తిట్టుకుంటారు’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ఆమెని ఈ సినిమాలో చూసి జనాలు తిట్టుకోవడం ఏమిటి?.
సాధారణంగా విలన్ క్యారెక్టర్స్ ని వెండితెర మీద చూసినప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాము. తమన్నా ఇందులో విలన్ క్యారక్టర్ చేస్తుందా అనే అనుమానాలు ఆమె మాటలను చూస్తే కలుగుతుంది. ఇంతకు ముందు కూడా ఆమె విలన్ క్యారెక్టర్స్ చేసింది. తమిళం లో ఆమె మొదటి సినిమా కేడి లో విలన్ క్యారక్టర్ లోనే కనిపించింది. ఆ తర్వాత తెలుగు లో నితిన్ హీరో గా నటించిన ‘మాస్ట్రో’ చిత్రంలో విలన్ రోల్ చేసింది. ఇప్పుడు ‘ఓదెల 2’ లో కూడా ఆమె విలన్ క్యారక్టర్ చేసుంటే, ఈ జనరేషన్ హీరోయిన్స్ లో అత్యధిక విలన్ రోల్స్ చేసిన హీరోయిన్ గా తమన్నా నిలుస్తుంది, చూడాలి మరి తమన్నా క్యారక్టర్ ఓదెల 2 లో ఎలా ఉండబోతుంది అనేది.