Ram Charan: ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గేమ్ చేంజర్’ మూవీ షూటింగ్ పూర్తి అయిన నెల రోజులకే రామ్ చరణ్ ఈ సినిమా కోసం తన లుక్స్ మొత్తాన్ని మార్చేశాడు. మొదటి షెడ్యూల్ ని కూడా గేమ్ చేంజర్ విడుదలకు ముందే పూర్తి చేశాడు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ చిత్రం, ఈ ఏడాది లోనే విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.
ఇప్పటికే టైటిల్, విడుదల తేదీని లాక్ చేసారని, మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేస్తారని, ఆ పోస్టర్ లో టైటిల్ తో పాటు, విడుదల తేదీ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి చేరింది. ఈ సినిమా విడుదలయ్యే రోజునే నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) చిత్రం విడుదల కాబోతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసి, అందులో విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇది రామ్ చరణ్ కొత్త సినిమాకు ఏమాత్రం తీసిపోని చిత్రమే. పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. కాబట్టి ఈ సినిమాకు విడుదల సమయంలో పెద్ద హీరో సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా క్రేజ్ ఉంటుంది.
రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే రెండు చిత్రాలకు నష్టమే. అందుకే ఎదో ఒక సినిమా కచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. నాని సినిమానే వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాని త్వరలో మెగాస్టార్ చిరంజీవి తో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో ఒక సినిమాని నిర్మించబోతున్నాడు. కాబట్టి చిరంజీవి తనయుడు సినిమా విడుదల అవుతుందంటే, ఆయన కచ్చితంగా పక్కకి తప్పుకుంటాడు. అయితే అభిమానులు మాత్రం వచ్చే సంవత్సరం వరకు ఎందుకు ఆగాలి?, ఇదేమి గ్రాఫిక్స్ సబ్జెక్టు మూవీ కాదు, విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ, జెట్ స్పీడ్ లో షెడ్యూల్స్ ని ముగిస్తున్నారు. మరి అలాంటప్పుడు వచ్చే ఏడాది వరకు ఎందుకు ఆగడం, ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయొచ్చు కదా అని అంటున్నారు. చూడాలి మరి మార్చి 27న మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనేది.