https://oktelugu.com/

Ram Charan: అనుష్పాల వేడుకలో రాయల్ ​లుక్​లో రామ్​చరణ్​, ఉపాసన.. నెట్టింట్లో పిక్స్ వైరల్​

Ram Charan: మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్ మరదలు అనుష్పల వివాహం బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఉపాసన కామినేని ముద్దుల చెల్లెలు అనుష్పల తను ప్రేమించిన అబ్బాయితోనే ఈ వివాహం నిశ్చయించారు పెద్దలు. సన్నిహితులు, కుటుంబ పెద్దల సమక్షంలో నిన్న అర్మాన్​ ఇబ్రహిమ్​తో పెళ్లి ఘనంగా జరిగింది. అనుశ్పాల, అర్మాన్​ల వివాహానికి ముందు జరిగిన వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇటీవలే సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే రామ్​చరణ్​, ఉపాసన ఫ్యామిలీ రాయల్​లుక్​లో అదిరిపోయే డ్రస్​తో దర్శనమిచ్చారు. పెళ్లిలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 10:09 AM IST
    Follow us on

    Ram Charan: మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్ మరదలు అనుష్పల వివాహం బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఉపాసన కామినేని ముద్దుల చెల్లెలు అనుష్పల తను ప్రేమించిన అబ్బాయితోనే ఈ వివాహం నిశ్చయించారు పెద్దలు. సన్నిహితులు, కుటుంబ పెద్దల సమక్షంలో నిన్న అర్మాన్​ ఇబ్రహిమ్​తో పెళ్లి ఘనంగా జరిగింది. అనుశ్పాల, అర్మాన్​ల వివాహానికి ముందు జరిగిన వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇటీవలే సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే రామ్​చరణ్​, ఉపాసన ఫ్యామిలీ రాయల్​లుక్​లో అదిరిపోయే డ్రస్​తో దర్శనమిచ్చారు.

    Ram Charan Upasana

    పెళ్లిలో రామ్​చరణ్​ క్రీమ్ కలర్ షేర్వాణి ధరించగా.. ఉపాసన భారీగా అలంకరించిన షరారా సెట్​ను ధరించింది. తన సోదరి వివాహానికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. నిజంగా నా జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజు. నా ముద్దుల చెల్లెలు మీరాకు శుభాకాంక్షలు.. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా.. అంటూ పోస్ట్​ చేసింది. దీంతో పాటు, ఈవెంట్​కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది.
    Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఇవే హైలైట్స్.. ఇవి 5 గమనించారా?

    కాగా, అపోలో గ్రూప్​ వైస్​ ప్రెసిడెంట్​ శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పాల కామినేని.రేసర్ అర్మన్, అనుష్పాల గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మాజీ ఇండియన్ ఎఫ్​3 ఛాంపియన్ అక్బర్​ ఇబ్రహిమ్​ తనయుడే అర్మన్ ఇబ్రహిమ్​. ఈ క్రమంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా కార్ రేస్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    మరోవైపు ఆచార్య సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్న మెగాస్టార్​.. ఈ సినిమా తర్వాత వరుసగా మరో రెండు, మూడు ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నారు. రామ్ చరణ్​ కూడా ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్ ముగించుకుని.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెకక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్​ పర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్​లోకి అడుగుపెట్టింది.

    Also Read: ఫస్ట్ఆఫ్​​ మొత్తం తారక్​.. సెకండ్ ఆఫ్​లో రామ్​ బీభత్సం.. ట్రైలర్​లో రాజమౌళి చెప్పింది ఇదేనా?