https://oktelugu.com/

Bigg Boss Telugu 5: కొట్టినా నువ్వే… తిట్టినా నువ్వే… అరె ఏం మాయ చేశావ్రా!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ వెరీ కామన్. ఈ సీజన్లో మరింత వెరైటీగా ట్రాన్స్ జెండర్ తో కూడా లవ్ ట్రాక్ నడిపారు. కంటెస్టెంట్ ప్రియాంక మానస్ ని ప్రాణప్రదంగా ప్రేమించింది. హౌస్ లో అడుగుపెట్టిన నాటి నుండి ఎలిమినేట్ అయ్యే వరకు అతని సేవలో తరించింది. ఓపెన్ గా మేము లవర్స్ అని చెప్పుకోనప్పటికీ… అంతకు మించి అన్యోన్యంగా హౌస్ లో ఈ జంట మెలిగారు. ఈ బంధంలో […]

Written By:
  • Shiva
  • , Updated On : December 9, 2021 / 10:18 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ వెరీ కామన్. ఈ సీజన్లో మరింత వెరైటీగా ట్రాన్స్ జెండర్ తో కూడా లవ్ ట్రాక్ నడిపారు. కంటెస్టెంట్ ప్రియాంక మానస్ ని ప్రాణప్రదంగా ప్రేమించింది. హౌస్ లో అడుగుపెట్టిన నాటి నుండి ఎలిమినేట్ అయ్యే వరకు అతని సేవలో తరించింది. ఓపెన్ గా మేము లవర్స్ అని చెప్పుకోనప్పటికీ… అంతకు మించి అన్యోన్యంగా హౌస్ లో ఈ జంట మెలిగారు. ఈ బంధంలో డామినేషన్ మొత్తం మానస్ దే. తిట్టినా, కొట్టినా, విసిగించుకున్నా… ప్రియాంక మానస్ ని వదిలేది కాదు.

    Shanmukh and Siri

    ఇదే తరహా రొమాన్స్, అఫెక్షన్ కలిగి ఉన్న మరో జంట సిరి-షణ్ముఖ్. వీరిద్దరూ హౌస్ లోకి రాకముందు నుండే మిత్రులు. ఇద్దరికీ పరిచయం, మంచి అవగాహన ఉంది.బిగ్ బాస్ షోకి వచ్చాక వీరి రిలేషన్ మరింత బలపడింది. ఎంతగా అంటే ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా. గేమ్స్ లో , టాస్క్ లలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ఓ ప్రక్క మాకు బయట లవర్స్ ఉన్నారంటారు. మాది కేవలం స్నేహం అంటూనే రొమాన్స్ ఓ రేంజ్ లో కురిపిస్తారు.

    ఓ అబ్బాయి అమ్మాయి మధ్య స్నేహం విషయంలో హద్దులు ఉంటాయి. కానీ ఆ ఫ్రెండ్షిప్ పరిమితులు సిరి-షణ్ముఖ్ మధ్యలో కనిపించవు. పేరుకు మాత్రమే వీరు ఫ్రెండ్స్. వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. కారణం వాళ్ళ మధ్య చోటు చేసుకునే సంఘటనలే. సిరి తనతో కాకుండా మరో అబ్బాయితో క్లోజ్ గా ఉంటే షణ్ముఖ్ కి నచ్చదు. వెంటనే రియాక్ట్ అవుతాడు… నీకు లవ్ ట్రాక్ అంటగట్టి బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. నాకు నిన్ను దూరం చేయాలనుకుంటున్నారు అంటూ… ఏవేవో కారణాలు ఆమెకు చెప్తాడు. సిరి తనకు ఎక్కడ దూరమైపోతుందో అని భయపడుతూ ఉంటాడు.

    Also Read: Pushpa Movie: “పుష్ప” నుంచి ‘ఊ అంటావా… ఊహు అంటావా’ అంటూ వచ్చేస్తున్న సమంత…

    ఇక సిరి విషయానికి వస్తే కొట్టినా… తిట్టినా నువ్వే అన్నట్లు షణ్ముఖ్ వెంట పడుతుంది. అతడు ఎంతగా కోపగించుకున్నా వదలదు. షణ్ముఖ్ సిరిని ఎన్ని మాటలు అన్నా… తిరిగి ప్రశ్నించదు. అతన్ని బ్రతిమిలాడు కోవడం చేస్తుంది. బుధవారం ఎపిసోడ్ లో కూడా సిరిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. చివరికి సిరి వాళ్ళ అమ్మ గతంలో అన్న మాటలను తెరపైకి తెస్తూ… మీ అమ్మకు నా హగ్గులు మాత్రమే గుర్తున్నాయి. హౌస్ లో నీకు నేను సప్పోర్ట్ గా నిలిచిన విషయాలు మర్చిపోయిందంటూ ఫైర్ అయ్యాడు. షణ్ముఖ్ మాటలతో కన్నీరు పెట్టుకున్న సిరి… అతన్ని ఏమీ అనలేదు. షణ్ముఖ్ మైకంలో సిరి పడిపోగా.. ఏం మాయ చేశావ్ రా బాబు అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

    Also Read: Akhanda Movie: బాలయ్య “అఖండ” సినిమా ఒటీటీ రిలీజ్ ఎప్పుడంటే…

    Tags