https://oktelugu.com/

Bipin Rawat: సీడీఎస్​ జనరల్​ బిపిన్ రావత్​కు సినీ పరిశ్రమ నివాళి

Bipin Rawat: బుధవారం జరిగిన చాపర్​ ప్రమాదంలో టీఫ్​ ఆఫ్​ డిఫెనన్స్​ స్టాఫ్ జనలర్​ బిపిన్​ రావత్​ మరణించారు. డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్​ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బిపిన్​తో పాటు, ఆయన భార్య మధులికతో సహా మరో 11 మంది సైనికులు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో యావత్​ దేశం మొత్తం బిపిన్​ రావత్​కు సోషల్​మీడియా వేదికగా నివాళులు అర్పించింది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రకు చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 09:45 AM IST
    Follow us on

    Bipin Rawat: బుధవారం జరిగిన చాపర్​ ప్రమాదంలో టీఫ్​ ఆఫ్​ డిఫెనన్స్​ స్టాఫ్ జనలర్​ బిపిన్​ రావత్​ మరణించారు. డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్​ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బిపిన్​తో పాటు, ఆయన భార్య మధులికతో సహా మరో 11 మంది సైనికులు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో యావత్​ దేశం మొత్తం బిపిన్​ రావత్​కు సోషల్​మీడియా వేదికగా నివాళులు అర్పించింది.

    ఈ క్రమంలోనే సినీ పరిశ్రకు చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ… సోషల్​మీడియా వేదకగా పోస్ట్ చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు తమన్నా భాటియా, ఖుష్బు సుందర్, దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు నివాళులర్పించారు.

    Also Read: హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కన్నుమూత

    ఈ క్రమంలోనే మెగాస్టార్​ చిరంజీవి స్పందిస్తూ.. షాకింగ్​, విషాదకరమైన చాపర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన టాప్​ మిలిటరీ అధికారి దేశానికి తొలి సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్యతో సహా మరో 11 మందికి సైనిక కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. యావత్​ దేశానికిి ఆయన మరణం తీరని నష్టం కలుగజేసిందని పేర్కొన్నారు. దీంతో పాటు పవర్​స్టార్​ పవన్​ కళ్యాణ్​ కూడా బిపిన్​కు నివాళులు అర్పించారు. బిపిన్​ రావత్​ మరణం దేశానికి తీరని నష్టమని పవన్​ పేర్కొన్నారు. జనసేన తరఫున ఆయన ఈ పోస్ట్ చేశారు. వీరితో పాటు మమ్ముట్టి, దుల్కర్​ సల్మాన్​, బండ్లగణేశ్​, అల్లు శిరీష్​, తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.

    Also Read: హెలికాప్టర్ ప్రమాదాన్ని చూస్తే భయమేసింది? ప్రత్యక్ష సాక్షి మనోగతం