Ram Charan And Sukumar: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఉన్న సినిమాల లిస్ట్ తీస్తే అందులో ‘రంగస్థలం’ చిత్రం కచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఏ హీరో అయినా ఒక సినిమాలో అద్భుతంగా నటిస్తే, ‘రంగస్థలం’ లో రామ్ చరణ్(Global Star Ram Charan) నటనతో పోల్చి చూస్తున్నారు. ఈ సినిమాతో ఆయన సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటివి మరి. ఇక డైరెక్టర్ గా సుకుమార్(Sukumar) కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయన స్టోరీ టెల్లింగ్ మాస్టర్ క్లాస్ లాగా ఆడియన్స్ కి అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన ఇచ్చే ట్విస్ట్ ని చూసి ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన సుకుమార్ తో రామ్ చరణ్ రెండవ సారి చేతులు కలపబోతున్నాడు. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.
అయితే ఈ సినిమా ఎప్పటి నుండి ప్రారంభం కానుంది?, అన్ని సినిమాల గురించి అప్డేట్స్ వస్తున్నాయి కానీ, ఈ సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ రావడం లేదు, అసలు ఈ చిత్రం ఉందా లేదా? అనే సందేహాలు కూడా అభిమానుల్లో కలిగాయి. కానీ నేడు ఈ చిత్రం గురించి వచ్చిన అప్డేట్ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యిందట. గత కొంత కాలం గా సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దే పని కోసం దుబాయ్ లోనే ఉంటున్నాడు. అక్కడ తన టీం తో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేయడం లో ఆయన ఫుల్ బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పెద్ది మూవీ షూటింగ్ బ్రేక్ లో ఉన్న రామ్ చరణ్ కి సుకుమార్ ఫోన్ చేసి దుబాయి కి రమ్మని కోరడం, రామ్ చరణ్ రీసెంట్ గానే దుబాయి కి వెళ్లి స్క్రిప్ట్ మొత్తాన్ని విని రావడం జరిగింది. ఫైనల్ గా ఆయనకు చాలా బాగా నచ్చిందట. త్వరలోనే తుది మెరుగులు దిద్ది పూర్తి స్క్రిప్ట్ ని డైలాగ్ వెర్షన్ తో సహా లాక్ చేస్తారట. ఈ ఏడాది లో షూటింగ్ మొదలు అవ్వడం కష్టమే. వచ్చే ఏడాది సమ్మర్ నుండి షూటింగ్ ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతానికి రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.