Tollywood Heroes: ప్రస్తుతం మన టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరూ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. సాధారమైనంత వరకు అందరూ మినిమమ్ గ్యారంటీ హిట్స్ ఇచ్చే డైరెక్టర్స్ తోనే సినిమాలను సెట్ చేసుకుంటున్నారు. కానీ వీళ్లందరినీ బాగా గమనిస్తే ఒకే స్ట్రాటజీ ని అనుసరిస్తున్నట్టు గా అనిపిస్తుంది. ఆ స్ట్రాటజీ ఏమిటంటే తమకు గతం లో సూపర్ హిట్ అందించిన డైరెక్టర్స్ తో పని చేయడం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ని ఉదాహరణ గా తీసుకుందాం. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తర్వాత ఆయన డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేస్తున్నాడు. గతం లో బాబీ తో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా తీసాడు.
ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక బాలయ్య(Nandamuri Balakrishna) విషయానికి వస్తే రేపు ఆయన హీరో గా నటించిన ‘అఖండ 2’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఒక హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వీర సింహా రెడ్డి’ అనే చిత్రం తెరకెక్కింది. మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కూడా ఇదే ఫార్ములా ని అనుసరిస్తున్నాడు. గతం లో F2,F3 మరియు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్స్ ని తీసిన అనిల్ రావిపూడి తో మరోసారి ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ అనే చిత్రం చేయబోతున్నాడు. ఇక మీడియం రేంజ్ హీరోల విషయానికి వస్తే, నానితో దసరా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల, మరో సారి నాని(Natural Star Nani) తో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రం చేస్తున్నాడు.
ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. అదే విధంగా గతం లో తనతో ‘టాక్సీ వాలా’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన రాహుల్ సంక్రుత్యాన్ తో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇక స్టార్ హీరోల విషయానికి వస్తే తన తో రంగస్థలం లాంటి సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ తో, రామ్ చరణ్(Global Star Ram Charan) మరో చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే జరగనుంది. మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తనతో గతం లో గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇలా అందరూ ఒకే స్ట్రాటజీ ని అనుసరిస్తున్నారు. ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.