Akhanda 2 Release Postponed: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం కోసం అభిమానులు , ప్రేక్షకులు ఎన్నో రోజుల నుండి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు విడుదల అవుతోంది, ఇక థియేటర్స్ లో సంబరాలు చేసుకోవాలి అని ఫిక్స్ అయినా అభిమానులకు నిన్న రాత్రి మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ కి తీవ్రమైన నిరాశకు గురయ్యేలా చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘అఖండ 2’ చిత్రాన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం రేపు విడుదల చేయలేకపోతున్నామని, ఈ చిత్రాన్ని మీ ముందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేసాము కానీ, పరిస్థితులు అనుకూలించలేదని, కానీ త్వరలోనే ఇవన్నీ పరిషకరించుకొని, శుభవార్త తో మీ ముందుకొస్తామని చెప్పుకొచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, దాదాపుగా లక్షా 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
అదే విధంగా తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ పిడుగు లాంటి వార్త మింగుడుపడనివ్వకుండా చేసింది. ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు, నిర్మాతలు ఈ విషయం లో డిజాస్టర్ అయ్యారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ వద్ద భారీ బ్యానర్స్, కటౌట్స్ వేసిన ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంది ఉంటుందో ఊహించుకోవడానికి కూడా కష్టం గా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?, ఫైనాన్సియల్ సమస్యలు రేపు ఉదయం లోపు తీరిపోతే సాయంత్రానికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంటుందా?, లేదా డిసెంబర్ 13 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా?, లేదా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రేపు విడుదల కాకుంటే ఎల్లుండి విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నిర్మాతలు ఏమి చేస్తారో చూడాలి.
అసలు ఈ సినిమా విడుదలను వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఆగడు, 1 నేనొక్కడినే సినిమాల సమయం లో 14 రీల్స్ సంస్థ EROS తో నిర్మాణం లో భాగం పంచుకుంది. కానీ ఒప్పందం ప్రకారం 14 రీల్స్ నుండి EROS కి 28 కోట్ల రూపాయిల వరకు రావాలి. కేవలం అదొక్కటే కాదు, నాలుగైదు సంస్థలకు కూడా 14 రీల్స్ సంస్థ డబ్బులు ఇవ్వాలి. మొత్తం మీద 60 కోట్ల రూపాయిల వరకు అప్పులు ఉన్నాయి. వీళ్లంతా ఒక్కసారిగా 14 రీల్స్ సంస్థ పై తిరగబడి కేసు వేయడం తో ఈ చిత్రం విడుదలను ఆపివేస్తూ కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. తర్వాత ఏమి జరగబోతుందో చూడాలి.
With a heavy heart, we regret to inform you that #Akhanda2 will not be releasing as scheduled due to unavoidable circumstances.
This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film.
We are working…
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025