Sikander Movie : బాలీవుడ్ లో ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలలో ఒకటి సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన ‘సికిందర్'(Sikindar Movie). తమిళ దర్శకుడు AR మురుగదాస్(AR Murugadoss) తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ అపరిమితమైన స్టార్ స్టేటస్ కారణంగా ఈ సినిమాకు ఫుల్ రన్ లో దాదాపుగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి కానీ, వేరే హీరో చేసి ఉండుంటే బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సల్మాన్ ఖాన్ సినిమా కదా, ఎలా ఉన్నా జనాలు చూసేస్తారు లే అనే నిర్లక్ష్య ధోరణితో డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్పగలరు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సల్మాన్ ఖాన్ తో చేయాలని అనుకోలేదట.
Also Read : పెళ్ళైన 4 నెలలకే సంచలన నిర్ణయం తీసుకున్న కీర్తి సురేష్..ఫోటోలు వైరల్!
ఈ సినిమా స్క్రిప్ట్ ని పట్టుకొని అప్పట్లో మురుగదాస్ అప్పట్లో ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతూ తిరిగేవాడట. ఆ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). అప్పట్లో అల్లు అర్జున్ ‘డీజే’ చిత్రం తర్వాత ఏ సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉండగా మురుగదాస్ గీత ఆర్ట్స్ కి వచ్చి ఒక కథని వినిపించాడు. ఆ కథ అల్లు అర్జున్ కి నచ్చింది కానీ, పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేయాల్సిందిగా ఆయన ఆదేశించాడు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. ఈలోపు అల్లు అర్జున్ ట్రాక్ మారిపోయింది. ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో మురుగదాస్ చిత్రం ఊసే లేకుండా పోయింది.
అయితే ఎట్టకేలకు బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన తర్వాత మురుగదాస్ ముంబై కి వెళ్లి సల్మాన్ ఖాన్ కి ఈ స్టోరీ ని వినిపించాడు. ఆయనకు తెగ నచ్చేసింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమాని చేసాడు. ఫలితం ఏమైందో మనమంతా చూసాము. అయితే ఈ సినిమాని ‘డీజే’ సమయంలో తీసి ఉండుంటే కచ్చితంగా సూపర్ హిట్ అయ్యేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇది అప్పటి టైం లో రావాల్సిన సినిమా, ఇప్పుడు ఆడియన్స్ బాగా అప్డేట్ అయ్యారు, కొత్తదనం ఉన్న స్టోరీలనే ఆదరిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో ఇలాంటి సినిమా ని ఒప్పుకొని చేయడం ముమ్మాటికీ సల్మాన్ ఖాన్ తప్పునే. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన కం బ్యాక్ ఎప్పుడు ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి రీసెంట్ గానే మొదలైన అల్లు అర్జున్, అట్లీ చిత్రం ముందుగా సల్మాన్ ఖాన్, అట్లీ కాంబినేషన్ లో రావాలి, కానీ ఎందుకో సల్మాన్ ఈ చిత్రాన్ని వదులుకున్నాడు.
Also Read : మా సినిమాపై నెగటివ్ రివ్యూస్ ఇస్తున్న వాళ్లకు ఇదే నా వార్నింగ్ – విజయశాంతి