Hari Hara Veeramallu : టాలీవుడ్ పోలవరం ప్రాజెక్ట్ గా పిలవబడే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా పరిస్థితి ఏమిటి అనేది అభిమానులకు కూడా అంతు చిక్కడం లేదు. అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది అంటూ నిర్మాతలు నెలకు ఒక విడుదల తేదీ తో పోస్టర్స్ ని దింపుతున్నారే కానీ, ఆ సినిమా మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఎన్నో వాయిదాల తర్వాత ఈ చిత్రాన్ని మే9 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేసారు. హమ్మయ్య ఇప్పటికైనా ఈ సినిమా విడుదలకు మోక్షం లభించింది, పవన్ కళ్యాణ్ ని ఎట్టకేలకు వెండితెర మీద చూడబోతున్నాము అని అభిమానులు సంతోషించారు. కానీ ఇప్పుడు మే9న రావడం అసాధ్యమని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా చప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. మే9 కి నేటి నుండి సరిగ్గా 20 రోజుల సమయం కూడా లేదు.
Also Read : డేటింగ్ లో రామ్ పోతినేని, భాగ్య శ్రీ భోర్సే..ఆధారాలతో సహా దొరికిపోయారుగా!
ఈపాటికి మూవీ ప్రొమోషన్స్ మొదలు అవ్వాలి. సినిమాలో మిగిలి ఉన్న పాటలు ఒక్కొక్కటిగా విడుదల చేయాలి. కానీ అవేమి జరగడం లేదు. ఫిబ్రవరి నెలలో ‘కొల్లగొట్టినాదిరో’ అనే పాటను విడుదల చేశారు. ఆ తర్వాత ఈ చిత్రం నుండి ఒక్క సాంగ్ కూడా విడుదల కాలేదు. అసలు మే9 న ఈ చిత్రం వస్తుందో లేదో కూడా చెప్పడం లేదు దర్శక నిర్మాతలు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ బ్యాలన్స్ ఉంది, అందుకే సినిమా పూర్తి అవ్వలేదు అని కొందరు అంటున్నారు. కానీ ముంబై లో నేడు కూడా పవన్ కళ్యాణ్ లేని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఇది చూసిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారయ్యా బాబు, మా సహనాన్ని పరీక్షిస్తున్నారు, అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని మండిపడుతున్నారు ఫ్యాన్స్.
సినిమా వాయిదా పడింది అనే విషయం మాకు ఇప్పటికే అర్థమైపోయింది, కనీసం ఇప్పుడైనా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసిన తర్వాత మాత్రమే విడుదల తేదీని ప్రకటించండి. అలా కాకుండా మీ ఇష్టమొచ్చినట్టు చేసి మళ్ళీ వాయిదా పడింది అనే వార్త వినిపిస్తే మీ ఆఫీస్ కి వచ్చి కొడుతాము అంటూ నిర్మాత AM రత్నం ని ట్యాగ్ చేసి అభిమానులు పోస్టులు వేస్తున్నారు. అందుతన్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు . అంతే కాకుండా వెన్ను నొప్పి కూడా ఆయన్ని తీవ్రంగా బాధిస్తుంది. హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే కాస్త కోలుకున్న తర్వాత ఈ నెల 25 నుండి 30 లోపు డేట్స్ ఇస్తానని, సినిమా షూటింగ్ ని ఈ నెలలోనే పూర్తి చేస్తానని మేకర్స్ కి మాట ఇచ్చాడట పవన్ కళ్యాణ్. మరి ఇది ఎంత వరకు నిజమో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
Also Read : సికిందర్’ చిత్రాన్ని మిస్ అయిన తెలుగు హీరో అతనేనా..? భలే తప్పించుకున్నాడుగా!