https://oktelugu.com/

డ్రగ్స్ కేసులో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టిందా?

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో విచారణకు టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌కు కూడా సమన్లు అందాయి. ఎన్సీబీ అధికారులు ఆమెనూ విచారణ నిమిత్తం పలిచారు. Also Read: డ్రగ్ కేసు విచారణకు దీపికా.. భర్త రణవీర్ కు షాక్ శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరైన రకూల్‌ పలు కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల కేసులో బుధవారం సాయంత్రం రకూల్‌కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2020 / 01:44 PM IST
    Follow us on

    సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో విచారణకు టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌కు కూడా సమన్లు అందాయి. ఎన్సీబీ అధికారులు ఆమెనూ విచారణ నిమిత్తం పలిచారు.

    Also Read: డ్రగ్ కేసు విచారణకు దీపికా.. భర్త రణవీర్ కు షాక్

    శుక్రవారం ఎన్సీబీ విచారణకు హాజరైన రకూల్‌ పలు కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మాదక ద్రవ్యాల కేసులో బుధవారం సాయంత్రం రకూల్‌కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆమె శుక్రవారం విచారణకు హాజరైంది. దాదాపు నాలుగు గంటలపాటు రకూల్‌ను అధికారులు విచారించినట్టు తెలుస్తోంది.

    విచారణలో భాగంగా రకూల్ ‘డ్రగ్ చాట్స్’ చేసినట్టు అంగీకరించిందట. కానీ.. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ సరఫరాదారులతో సంప్రదింపులు జరపలేదని ఆమె చెప్పినట్టు సమాచారం. అలాగే నలుగురు సెలబ్రిటీల పేర్లు కూడా చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

    Also Read: ట్రైలర్ టాక్: ‘దిశ’ హత్యోదంతంను కళ్లకు కట్టారు!

    తన స్నేహితులు కొందరికి క్షితిజ్ రవి ప్రసాద్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేసినట్టు రకూల్ వెల్లడించిందట. క్షితిజ్ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు అత్యంత సన్నిహిత వ్యక్తి. కరణ్‌కు రైట్ హ్యాండ్ లాంటి వాడని అని వార్తలు వస్తున్నాయి. అయితే.. క్షితిజ్ నుంచి డ్రగ్స్ తీసుకున్న నలుగురు సెలబ్రిటీల పేర్లను కూడా రకూల్‌ చెప్పిందట. దీంతో కరణ్‌ను కూడా ఎన్‌సీబీ విచారణకు పిలవబోతున్నట్లు సమాచారం.