డ్రగ్ కేసు విచారణకు దీపికా.. భర్త రణవీర్ కు షాక్

బాలీవుడ్‌, టాలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌.. అన్నింటినీ ప్రస్తుతం డ్రగ్స్‌ కేసు వెంటాడుతూనే ఉంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసును విచారిస్తున్న పోలీసులకు ఈ డ్రగ్స్‌ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో లింక్‌ ఉన్న వారినందరినీ విచారించేందుకు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనేను విచారణకు పిలిచారు. Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టిందా? దీపిక దక్షిణ ముంబైలోని కొలాబాలో ఎన్సీబీ సిట్ గెస్ట్‌హౌజ్‌కు దీపిక […]

Written By: NARESH, Updated On : September 26, 2020 2:47 pm

deepika padukone

Follow us on

బాలీవుడ్‌, టాలీవుడ్‌, శాండిల్‌ వుడ్‌.. అన్నింటినీ ప్రస్తుతం డ్రగ్స్‌ కేసు వెంటాడుతూనే ఉంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసును విచారిస్తున్న పోలీసులకు ఈ డ్రగ్స్‌ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో లింక్‌ ఉన్న వారినందరినీ విచారించేందుకు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనేను విచారణకు పిలిచారు.

Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టిందా?

దీపిక దక్షిణ ముంబైలోని కొలాబాలో ఎన్సీబీ సిట్ గెస్ట్‌హౌజ్‌కు దీపిక చేరుకున్నారు. ప్రస్తుతం ఆమెను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీపికకు తోడుగా తానూ విచారణకు హాజరవుతానని రణ్‌వీర్ సింగ్ చేసుకొన్న అభ్యర్థనను ఎన్సీబీ తోసిపుచ్చింది. డ్రగ్స్ కేసులో భాగంగా దీపిక పదుకోన్‌కు సమన్లు జారీ చేయడంతో రణ్‌వీర్ సింగ్ విదేశాల్లో నుంచి నేరుగా గోవాకు చేరుకున్నారు. భార్యకు అండగా నిలిచారు. అక్కడి నుంచే 12 మందికిపైగా లాయర్ల బృందంతో కేసు గురించి చర్చించారు. ఆ క్రమంలోనే దీపికతోపాటు తనను విచారణకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరారు.

అయితే.. ఈ అభ్యర్థనను ఎన్సీబీ అధికారులు తోసిపుచ్చారు. ‘నా భార్యకు మానసిక సమస్యలు ఉన్నాయి. ఆమె ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆమె వెంట ఉంటే బాగుంటుంది’అని రణ్‌వీర్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్సీబీ అంగీకరించకపోవడంతో దీపిక ఒక్కరే విచారణకు హాజరైనట్టు సమాచారం.

దీపికను పలు అంశాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నలు కురిపిస్తున్నట్టు సమాచారం. దీపిక కోసం పలు ప్రశ్నలతో కూడిన జాబితాను కూడా ఇప్పటికే తయారు చేసి ఆమెకు అందించినట్టు తెలుస్తోంది. ఆ జాబితాలోనే ఆమె రాతపూర్వకమైన సమాధానాలు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. 2019లో కరణ్ పార్టీ, అలాగే 2017లోని కోకో రెస్టారెంట్ పార్టీ గురించి అనేక ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ధర్మ ప్రొడక్షన్ సిబ్బంది, కరిష్మా ప్రకాశ్ చెప్పిన విషయాలను దీపిక తోసిపుచ్చినట్టు కథనాలు వస్తున్నాయి.

Also Read: ట్రైలర్ టాక్: ‘దిశ’ హత్యోదంతంను కళ్లకు కట్టారు!

శనివారం ముగ్గురు టాప్ హీరోయిన్లు సారా ఆలీ ఖాన్, శ్రద్ధాకపూర్, దీపిక పదుకోనేను విచారిస్తుండటంతో బాలీవుడ్‌, మీడియాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముందస్తు ప్లాన్ ప్రకారం కాకుండా వీరిని వేర్వేరు ప్రదేశాల్లో విచారించేందుకు ఎన్సీబీ ఏర్పాట్లు చేసింది. శ్రద్ధా కపూర్‌ ఎన్సీబీ జోనల్ ఆఫీస్‌లో జరిగే విచారణకు 11 నుంచి 12 గంటల ప్రాంతంలో హాజరుకానున్నారు. శుక్రవారం దీపిక పదుకోనే మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను, హీరోయిన్ రకుల్ ప్రీత్‌ను సుదీర్ఘంగా విచారించారు.